దాతలపై దురుసుగా ప్రవర్తించిన దేవాలయ ఎండోమెంట్ అధికారిపై చర్యలు తీసుకోవాలి.... రాయిరాల సుమన్ మౌర్య

Feb 8, 2025 - 16:53
Feb 8, 2025 - 20:06
 0  3
దాతలపై దురుసుగా ప్రవర్తించిన దేవాలయ ఎండోమెంట్ అధికారిపై చర్యలు తీసుకోవాలి.... రాయిరాల సుమన్ మౌర్య

మునగాల 08 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మునగాల మండలం బరాకత్ గూడెం గ్రామానికి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయo లోని కోనేరు మెట్ల అభివృద్ధి కొరకు దాతల నుండి డబ్బులు తీసుకున్న దేవాలయ అధికారులు కుల వివక్ష తో భర్త లేని దళిత హిందూ మహిళ పేరును చివరిలో వ్రాశారు అని చైర్మన్ ని, అధికారులను ప్రశ్నిస్తే, సమన్వయము తో శాంతియూతంగా సమాధానం చెప్పవలసిన EO నువ్వెవరు, నీదేందీ అసలు అంటూ దురుసుగా మాట్లాడారు అని రాయిరాల సుమన్ అన్నారు. దాతలకు కనీసం సమాచారం ఇవ్వలేదు అని అడిగినందుకు దౌర్జన్యం గా దురుగా, వ్యాంగంగా సమాధానం చెప్తున్నారు అని తెలిపారు.దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నల్లగొండ వారికీ చరవాణి ద్వారా సంప్రదించాలి అని ప్రయత్నించిన వారు స్పందించలేదు అని అన్నారు. గతం లో ఉన్న EO కారణంగా దేవాలయనికి సుమారుగా 4 లక్షల నష్టం జరిగింది అని, వెంటనే అడిట్ నిర్వహించి చర్యలు తీసుకోవాలి అని కోరారు. 80 యేండ్ల స్వాత్రంత్ర దేశం లో నేటికీ దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారు అని, కనీసం స్వామి వారి ఊరేగింపు కూడా SC ST BC కాళినిలకు రానివ్వకపోవటం బాధాకరం గా ఉంది అని, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయానికి నేటికీ SC ST వ్యక్తులు చైర్మన్ లు నియమింపబడవపోవటానికి కుల వివక్ష కారణం అన్నారు.దేవాలయ చైర్మన్ లు SC ST లని నియమించాలి లేదా దేవుని మాన్యాలు మాకు ఇవ్వాలి అని అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా సుమన్ గారు డిమాండ్ చేశారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State