తొండ గ్రామంలో విద్యార్థులకు బహుమతుల అందజేత

తిరుమలగిరి 16 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మానవత్వం చాటుకున్న పూర్వ విద్యార్థులు 78వ స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా ఎల్లంల మహేష్ వారి తండ్రి ఎల్లంల సోమయ్య పేరు మీద పాఠశాల కు 5000 రూపాయల విలువ గల స్పోర్ట్స్ టీషర్ట్స్ అందజేశారు మరియు కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు ముక్కెర మహేష్ విద్యార్థులకు 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 4000 రూపాయల బహుమతులు అందజేశారు పాఠశాల యాజమాన్యం వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వివిధ సంఘాల నేతలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు