తెలంగాణ చిహ్నం.. మళ్ళీ వివాదం

Nov 6, 2024 - 16:16
 0  22
తెలంగాణ చిహ్నం.. మళ్ళీ వివాదం

జోగులాంబ గద్వాల 6 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-గద్వాల : తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం విషయంలో మరోసారి చర్చ మొదలైంది. గద్వాల ఆర్టీఏ చెక్ పోస్టు వద్ద అనధికారిక చిహ్నం కనిపించడం ఈ వివాదానికి తెరలేపింది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఎందరో కళాకారుల శ్రమ, స్ఫూర్తితో రూపుదిద్దుకున్న ఈ చిహ్నం, రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక. గత ప్రభుత్వ హయాంలో ఆవిష్కృతమైన ఈ చిహ్నంలోని ప్రతీ గీత తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.జూలై నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త చిహ్నం అమలులోకి వస్తుందని ప్రకటించారు. అయితే, కొత్తగా ప్రతిపాదించిన డిజైన్లు బాగాలేవని, ప్రస్తుత చిహ్నాన్నే కొనసాగించాలని ప్రజల నుంచి విస్తృతంగా డిమాండ్లు వెల్లువెత్తాయి. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, ప్రభుత్వం కొత్త చిహ్నం ప్రతిపాదనను నిరవధికంగా వాయిదా వేసింది.సరిగ్గా నెల రోజుల క్రితం నాగర్‌కర్నూల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. అక్కడ కూడా అనధికారిక చిహ్నం ప్రత్యక్షమైంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అధికారులు వెంటనే స్పందించి అనధికారిక చిహ్నాన్ని తొలగించి, అధికారిక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు గద్వాల ఘటనతో మళ్ళీ ఈ చర్చ తెరపైకి వచ్చింది. తెలంగాణ సర్కార్ ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.రాష్ట్ర చిహ్నం పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333