అధికారులు యాజమాన్యం కుమ్మక్కు తో ఇతనాల్ ఫ్యక్టరీ నిర్మాణం చేయాలని చూస్తున్నారు
బిజెపి జిల్లా అధ్యక్షులు ఎస్ రామచంద్ర రెడ్డి
జోగులాంబ గద్వాల 6 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-రాజోలి. చిన్న ధన్వాడ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు S.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం చిన్న ధన్వాడ గ్రామంలో నిర్మించబోయే ఇథనాల్ ఫ్యాక్టరీ దుష్పరిణామాలు భవిష్యత్ తరాలను నాశనం చేస్తాయి. అయినప్పటికీ అధికారులకు లంచాలు ఇచ్చి, తప్పుదోవ పట్టించి వ్యవసాయ యోగ్యమైన భూముల్లో ఫ్యాక్టరీ తెచ్చుకున్నారు ఇక్కడున్నవి చక్కటి నల్ల రేగడి భూములు. చిన్నధన్వాడకు, పెద్ద ధన్వాడకు కిలోమీటర్, రెండు కిలోమీటర్ల రేడియస్‌లోనే ఉన్నాయి. జనావాసాల మధ్య ఫ్యాక్టరీ వేయడం పర్యావరణానికి వ్యతిరేకం. మనుషుల సంచారం, జంతుజీవజాలం లేనిచోట ఈ ఫ్యాక్టరీలను వేసుకోవాలి. 20 కిలోమీటర్ల రేడియస్‌లో ఎలాంటి ఊర్లు ఉండకూడదు. ప్రస్తుతం ఇక్కడి ఊర్లన్నీ తుంగభద్ర నీటిపై ఆధారపడ్డాయి. కింద తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నీళ్లు కూడా లేకుండా పోతాయి. ఫ్యాక్టరీ ఏర్పాటైతే మనుషులకు కాన్సర్, ఊపిరితిత్తులు పాడావుతావి, చర్మరోగాలు, సంతానలేమి, జెన్యూపరమైన రోగాలు, అదేవిధంగా ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలు తుంగభద్రలో కలిపితే పది, పదిహేను పల్లెల్లో తాగునీరు దొరకదు. ప్రధానంగా అలంపూర్ పరివాహక ప్రాంతాల్లో కూడా పదుల సంఖ్యల్లో గ్రామాలకు తుంగభద్ర నుంచి తాగునీరు అందుతోంది. సుంకేశుల వద్ద కెసి కెనాల్‌లోనూ ఈ వ్యర్థాలు కలిపే అవకాశముంది. ఈ కెసి కెనాల్ వాటర్‌ను డ్రిరకింగ్ వాటర్‌గా చాలాచోట్ల వినియోగిస్తున్నారు. జలశయాలు కూడా నింపుకుంటున్నారు. తెలంగాణతో పాటు కర్నూల్, కడప ఈ రెండు జిల్లాలకు కూడా ఫ్యాక్టరీ వల్ల ప్రమాదం ఉంటుంది. తుంగభద్ర కృష్ణ నదికి ఉపనది. సంగమేశ్వర వద్ద తుంగభద్ర నీళ్లు కూడా కృష్ణా నదిలో కలిసిపోతాయి. దీంతో మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో నీటి కలుషితం ఏర్పడుతుంది. ఫ్యాక్టరీ ప్రారంభ దశలో ఉంది కాబట్టి పూర్తిగా నిలిపివేయాలి ఇక్కడి నుంచి ఎత్తివేయాలి. లేకపోతే తీవ్ర ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈ విషయంలో ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కూడా హెచ్చరిస్తున్నాం.
ఈ కార్యక్రమం లో చుట్టు పక్కల గ్రామ పెద్దలు, రైతులు, బీజేపీ రాజోలి మండలం అధ్యక్షులు సంజీవరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ఉప అధ్యక్షులు రాజశేఖర్ శర్మ, అయిజ మండలం బీజేపీ అధ్యక్షులు గోపాలకృష్ణ, కంపాటి భగత్ రెడ్డి, భీమన్న, మహేష్, తిరుపతి తదితరులు పాలుగోన్నారు. ..