తరుగు తేమ పేరుతో జరుగుతున్న దోపిడిని ప్రభుత్వం అరికట్టాలి
బిజెపి రాజోలి మండల అధ్యక్షులు కనికే శశి కుమార్.
జోగులాంబ గద్వాల 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :- రాజోలి. మండల కేంద్రంలోని రైతులకు మొక్కజొన్న మరియు వరి కొనుగోలు కేంద్రాలలో కనీస వసతులు కల్పిస్తూ తరుగు పేరుతో జరుగుతున్న దోపిడీని ఆపాలంటూ బిజెపి రాజోలి మండల అధ్యక్షుడు శశి కుమార్ డిప్యూటీ తాసిల్దార్ రమణ కి వినతి పత్రం అందజేశారు
ఈ సందర్భంగా శశి కుమార్ మాట్లాడుతూ రైతుల మొక్కజొన్న మరియు వరి కొనుగోలు కేంద్రాలలో గత 50 రోజుల నుండి ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యమును అమ్ముకోవడానికి వచ్చిన రైతుల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా గోనె సంచులు ఇవ్వకుండా రైతులే కొనుగోలు చేసినప్పటికీ 20 రోజులకు పైగా లారీలు లేవని కొనుగోలు సెంటర్లలోని ఉంచడం అకాల వర్షాలవల్ల సంభవిస్తున్న నష్టం రావడం వానలకు ధాన్యం తడిసి ముద్దయి పూర్తిగా దెబ్బతింటున్నా వారి బాధ రైతుల గోస ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా రైతుల ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ వారి ధాన్యానికి సంబంధించిన డబ్బు నెలలు గడుస్తున్నా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం లేదు వారు పంటకి అప్పులు తెచ్చుకొని నానా బాధలు పడుతున్నారు వారికి వెంటనే రైతుల ఖాతాలో డబ్బు వెంటనే జమ చేయాలని లేని పక్షంలో భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరుగుతున్నది కాబట్టి వెంటనే రైతుల యొక్క బాధను తీర్చాలని ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు, కోశాధికారి రాజేష్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.