జనగణన సర్వే లో తప్పుడు కుల దృవీకరణ కు ఆస్కారం ఇవ్వొద్దంటు వినతిపత్రం

May 21, 2026 - 20:39
 0  1
జనగణన సర్వే లో తప్పుడు కుల దృవీకరణ కు ఆస్కారం ఇవ్వొద్దంటు వినతిపత్రం

జోగులాంబ గద్వాల 21 మే 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :- జనగణన సర్వేలో తప్పుడు కులదృవీకరణ కు ఆస్కారం ఇవ్వొద్దంటు ప్రజా సంఘాలు,జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ &మానిటరింగ్ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించారు. జిల్లా లో కొందరు బీసీ కుర్మ లు తప్పుడు మార్గం లో ఎస్సీ మదాసి, మాదరి కులధ్రువీకరణపొందెందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకోసం సర్వే అధికారుల పై ఒత్తిడి చెయ్యడం తో పాటు, అక్కడక్కడా బెదిరింపుల కు పాల్పడుతున్నారని తమ దృష్టికి రావడం జరిగిందని, ముఖ్యం గా జోగులాంబ గద్వాల జిల్లా లో ఎస్సీ మదాసి, మాదరి కుర్వలు లేరు, ఉన్నది బీసీ కుర్మ లే ఉన్నారు, అయితే కొంతమంది రాజకీయ లబ్ది కోసం మనం బీసీ కుర్మ లం కాదు, ఎస్సీ మదాసి, మాదరి కుర్వలమంటూ బీసీ, ఎస్సీ కులలో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. వీరు గత ఐదు, ఆరు సంవత్సరాలనుండి ఇలాంటి తప్పుడు ఆలోచన ధోరణి తో  వారి ప్రయత్నాలు చేస్తున్నారు, ఇట్టి విషయం గురించి గత ఉమ్మడి జిల్లా కలెక్టర్ లు, గద్వాల జిల్లా కలెక్టర్లు పూర్తి స్థాయిలో విచారణ జరిపించి గద్వాల జిల్లా లో ఎస్సీ మదాసి, మాదారి కుర్వలు లేరంటు స్పష్టంగా ప్రభుత్వం కు రిపోర్ట్ చెయ్యడం జరిగింది, ఇట్టి విషయాల ను పూర్తి ఆధారాల తో జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం ను సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో ఎం ఎస్ పి జిల్లా కన్వీనర్, ఎమ్మార్పీఎస్  జిల్లా మాజీ అధ్యక్షులు ఐజ రాజు మాదిగ, మాల మహానాడు రాష్ట్ర నాయకులు మాల శ్రీనివాస్ లు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ &మా నిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు కురుమన్న, ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధికార ప్రతినీది గద్వాల అశోక్ మాదిగ, వాల్మీకి బహుజన రాజ్య సమితి నాయకులు, మోషే మాదిగ జిల్లా ప్రధాన కార్యదర్శి, కన్నా మాదిగ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, ఏసు కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ నాయకులు, రంజిత్ కుమార్ మాజీ ఉప సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు, తిరుమలేష్ మాదిగ కళ కారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333