ట్రాఫిక్ సమస్యలపై ఫైర్ అయిన ఎస్సై చలికంటి నరేష్
స్వయంగా నడుచుకుంటూ ట్రాఫిక్‌ను పరిశీలించిన ఎస్సై
రోడ్ల ఆక్రమణలపై కఠిన హెచ్చరికలు జారీ చేసిన ఎస్సై
హుజూర్‌నగర్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు
హుజూర్‌నగర్ నూతన ఎస్సైగా బుధవారం బాధ్యతలు చేపట్టిన చలికంటి నరేష్ రెండు రోజులకే తన మార్క్ చూపిస్తున్నారు. పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలను గుర్తించేందుకు ఆయన స్వయంగా పాత బస్టాండ్ నుంచి ఇందిరా చౌక్ వరకు నడుచుకుంటూ పరిశీలించారు. రోడ్లపై వ్యాపారాల విస్తరణ, ఎక్కడపడితే అక్కడ వాహనాల పార్కింగ్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించారు. పార్కింగ్‌కు కేటాయించిన హద్దులు దాటి రోడ్డుపై వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు హెచ్చరించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కల్పించేందుకు చర్యలు చేపడుతున్న ఎస్సై నరేష్‌ను స్థానికులు అభినందిస్తున్నారు.