సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

Sep 29, 2026 - 20:53
 0  1
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ఉత్తమ పద్మావతి రెడ్డి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

మునగాల 29 సెప్టెంబర్ 2026 

తెలంగాణ వార్త ప్రతినిధి :-

మునగాల మండల వ్యాప్తంగా 34 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 14 లక్షల 20 వేల 500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంగళవారం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థికంగా అండగా ఉంటామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసర్ల కోటేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు నల్లపాటి శ్రీనివాస్, విజయరాఘపురం సర్పంచ్ సుంకర్ పిచ్చయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొలిశెట్టి బుచ్చి పాపయ్య, సీనియర్ నాయకుడు నరేందర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బచ్చు అశోక్ కుమార్ జిల్లా అధికార ప్రతినిధి మాతంగి బసవయ్య, ఇనుగుర్తి వీరాచారి,తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State