ప్రతి ఒక్కరు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి..
మునగాల 29 సెప్టెంబర్ 20 26
తెలంగాణ వార్తా ప్రతినిధి
నల్గొండ,ఖమ్మం,వరంగల్,జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బచ్చు అశోక్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.నవంబర్ ఒకటి నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన వారు అప్లై చేసుకోవచ్చని నవంబర్ 6 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకుని దరఖాస్తు ఫారాలను మండల ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇవ్వాలని గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు కూడా మళ్లీ తిరిగి అప్లై చేసుకోవాలని చెప్పారు.ఓటు ఫారం 18 నింపాల్సి ఉంటుందని డిగ్రీ సర్టిఫికెట్,ఓటర్ కార్డు,ఆధార్ కార్డు ఆన్లైన్ చేసిన తర్వాత ఆన్లైన్ పారాలు,జిరాక్స్ లు బిఎల్ఓ కు ఇవ్వవచ్చని అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.