నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి: ప్రజావాణిలో వినతి

Sep 28, 2026 - 20:07
 0  1
నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి: ప్రజావాణిలో వినతి

ములుగు, సెప్టెంబర్ 28: రాష్ట్ర  : ప్రభుత్వం నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. భూమిలేని పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేర్చేలా అర్హులను గుర్తించి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని అధికారులను కోరారు.ప్రభుత్వం చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకుని ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారని అధికారులు తెలిపారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి స్థలాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు పేర్కొంటున్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన గుడిసేవ కమల పుష్పావతి  మరియు రాజ్యలక్ష్మి అలాగే పలువురు ప్రజావాణి అధికారికి ఇంటి స్థలం కోసం దరఖాస్తు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ప్రజావాణిలో నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని వాటితో పాటు ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది. కమలాపురం గ్రామానికి చెందిన గుడిసేవ కమల పుష్పావతి మండల ప్రజావాణి అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మంగపేట మండలంలో కమల పుష్పావతి లాంటివారు అనేకమైన నిరుపేదలు ఇంటి స్థలాలు లేని వారు ఉన్నారని ప్రజలు పత్రిక ముఖంగా అనడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలాలు లేని వారిని గుర్తించి ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను ప్రజలు కోరుకుంటున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333