జ్యోతిర్ముడితో శ్రీశైలం కి బయలుదేరిన శివస్వాములు...!

శివనామస్మరణతో మార్మోగిన కొంకల గ్రామము...!
జోగులాంబ గద్వాల 2 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- వడ్డేపల్లి. మండలం కొంకల గ్రామంలో శ్రీశ్రీశ్రీ నీలకంటేశ్వర స్వామి ఆలయంలో శివస్వాములు ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు,మార్చి 08న మహాశివరాత్రి సందర్భంగా మండల దీక్ష,అర్ధ మండల దీక్ష స్వీకరించిన శివ స్వాములు ఈ దీక్షావిరమణ సమయంలో జ్యోతిర్ముడిని శ్రీశైలంలో సమర్పిస్తారు. శనివారం తెల్లవారుజామున శివుడికి అభిషేకాలు నిర్వహించి,అనంతరం జ్యోతిర్ముడి వేసుకొని, కొంకల గ్రామం నుంచి 14 మంది శివ స్వాములు శ్రీశైలంకి బయలుదేరారు వీరిని గ్రామంలోని ప్రజలు శివ భక్తులు, శివనామస్మరణతో ఊరేగింపుగా తిరిగి పూజలు నిర్వహించారు...!
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, శివ భక్తులు, చిన్నారులు మరియు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు...!