జోగులాంబకు శాంకాంబరి అలంకరణ ఎందుకంటే.
జోగులాంబ గద్వాల 7 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- అలంపూర్. అమ్మవారు ఆషాడ మాసం ముగింపు ఉత్సవాల్లో శాకంబరీ దేవిగా దర్శనం ఇస్తారు దుర్గాదేవి అవతారమైన ఈమె ప్రకృతి వృక్ష సంపదకు అధిష్టాన దేవత సమస్త వృక్షజాలన్నీ కూరగాయలు ఆకు కూరలను వస్త్రాలుగా ధరించడం వల్ల ఈ జగన్మాతను శాకాంబరి దేవి అంటారు. లోకంలో కరువు కాటకాలను రూపుమాపి సస్య శ్యామాలంతో సకల జీవులకు ఆయురారోగ్యాలు ఆహార వర్షాలను ప్రసాదించే అన్నపూర్ణాదేవి రూపంగా అమ్మవారిని ఇలా విశేషంగా అలంకరిస్తారు.