రామనామ స్మరణతో మార్మోగిన రాజాపురం గ్రామం

Aug 8, 2026 - 01:07
 0  2
రామనామ స్మరణతో మార్మోగిన రాజాపురం గ్రామం
రామనామ స్మరణతో మార్మోగిన రాజాపురం గ్రామం

జోగులాంబ గద్వాల 7ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మండల పరిధిలోని రాజాపురం గ్రామంలో శ్రీరామ హృదయం కార్యక్రమాన్ని భక్తిప్రపత్తులతో ఘనంగా నిర్వహించారు. స్థానిక రంగనాథస్వామి తోరణం నుంచి శ్రీరామ ఆలయం వరకు భక్తులు "శ్రీరామ జయరామ జయ జయ రామ" నామస్మరణ చేస్తూ భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి పారవశ్యం చాటుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ధూప దీప నైవేద్య అర్చక సమాఖ్య అధ్యక్షుడు చక్రవర్తి చార్యులు మాట్లాడుతూ శ్రీరాముని నామస్మరణను నిరంతరం చేసే వారి హృదయంలో శ్రీరాముడు కొలువై ఉండి, వారిని సదా రక్షిస్తూ అనుగ్రహిస్తాడని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామంలో శాంతి, సౌభాగ్యాలను పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పులికంటి అశోక్, వికాస తరంగిణి అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, సర్పంచ్ రాముడు, శ్రీనివాసులు, కాసిం పటేల్‌తో పాటు గ్రామ పెద్దలు, భక్తులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333