జోగినాధ స్వామి రథోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు
జోగిపేట -అందోల్ నియోజకవర్గం తెలంగాణ వార్త ప్రతినిధి:- సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం జోగిపేట పట్టణ కేంద్రం లో జోగినాథ స్వామి ఆలయం లో పూజలు నిర్వహించరు, ఓం నమశ్శివాయ శ్రీ జోగినాథ స్వామి, రోజు రథసప్తమి సందర్భమున ఉదయం ఆరు గంటలకి శ్రీ జోగినాథ స్వామి పూజా కార్యక్రమం చేశారు తధానంతరం రథోత్సవమునకు పూజా కార్యక్రమం కమిటీ సభ్యులు చేశారు, కాబట్టి శ్రీ జోగినాథ స్వామి భక్తులు అందరూ కూడ రథసప్తమి పూజా కార్యక్రమానికి భక్తులు చాలా వచ్చారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి శ్రీ జోగినాథ స్వామి వారి తీర్థ ప్రసాదములు తీసుకున్నారు, శ్రీ జోగినాథ స్వామి రథోత్సవ కమిటీ శ్రీ జోగినాథ స్వామి ప్రధాన అర్చకులు భద్రయ్య స్వామి అర్చకులు సిద్దేశ్వర్ స్వామి జోగిపేట వాస స్వయంభు జోడు లింగాల స్వామి జోగినాథ్ స్వామికి జై పలికారు, ఈ కార్యక్రమంలో జోగినాథ స్వామి కమిటీ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ డాకూరి శివశంకర్ ,అధ్యక్షతన వహించారు . ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సురేందర్ గౌడ్ , మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల రేఖ ప్రవీణ్ , మాజీ కౌన్సిలర్ రంగా సురేష్ ,PRTU సభ్యులు ఆకుల మాణయ్య ,మాజీ మోర్కెట్ కమిటీ చెర్మన్ డిబి నాగభూషణం , చాపల వెంకటేశం , శ్రీనివాస్ , మరియు మేస్త్రి సంఘం అధ్యక్షుడు నాగయ్య మరియు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, జోగిపేట పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.