జిల్లా కలెక్టర్ కు వినతి బిజెపి నాయకులు.

Dec 30, 2024 - 18:45
 0  8
జిల్లా కలెక్టర్ కు వినతి బిజెపి నాయకులు.

జోగులాంబ గద్వాల 30 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-  గద్వాల జిల్లాలోని అయిజ రోడ్డు,మానవపాడు మండలం పోతుల పాడు, చేన్ని పాడు గ్రామ రోడ్డు మార్గం మరమ్మతులు గురుంచి  ఈరోజు ప్రజావాణి లో కలెక్టర్ BM సంతోష్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి  మాట్లాడుతూ.మానవ పాడు మండలం చెన్ని పాడు గ్రామంలో 2002 సంవత్సరం నుండి ఇంతవరకు రోడ్డు మరమ్మతులు కానీ కొత్త రోడ్లు వేయడం జరగలేదు. ఉదాహరణకు జోగులంబా గద్వాల జిల్లా కేంద్రం లో రోడ్ల పరిస్థితి ఇలాగే వున్నదని  అధికారుల దృష్టి కి తీసుకెళ్లిన ఫలితం లేదని  వర్షాకాలంలో ఆటోలు ,rtc బస్సులు, స్కూల్ బస్సులు బురదలో కురుక్కు పోతున్నాయని పిల్లలను స్కూలుకు పంపాలంటే భయంగా ఉందని వెంటనే తక్షణమే పరిష్కారం చేయగలరని కోరడం జరిగింది.అలాగే  ఉండవెళ్లి మండలం తక్కశీల గ్రామంలో  శివాజ్ మహరాజ్ సేవ సమితి ఆధ్వర్యంలో ఛత్రపతి మహరాజ్ వారి విగ్రహం ప్రతిష్టించడం కోసం తక్కశిలా గ్రామ బస్టాండ్ లోసెంటర్ లో ప్రభుత్వ స్థలం లో విగ్రహం ఏర్పాటు కోసం కలెక్టర్ ని అనుమతి కోసం దరఖాస్తు ఇవ్వడం జరిగింది..ఈ కార్యక్రమంలో అల్లంపూర్ అసెంబ్లీ కి పోటీ చేసిన అభ్యర్థి రాజగోపాల్, బిజెపి నాయకులు kk రెడ్డి,నాగేశ్వర్ రెడ్డి,రాజశేఖర్ శర్మ,లక్ష్మన్ గౌడ్, రఘు ,మురళి,బాలకృష్ణ, రవి తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333