జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి

Aug 29, 2026 - 21:41
 0  13
జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి

అనుసంధాన రహదారులను పూర్తి చేసి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి

అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్ జి,

ములుగు జిల్లా, ఆగస్టు :29 : జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అవసరమైన రోడ్డు భద్రతా చర్యలను పటిష్టంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్ జి సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్ జి అధ్యక్షతన నూతన కలెక్టరేట్ తన ఛాంబర్ లో రోడ్డు భద్రతా సమావేశం నిర్వహించారు.అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై మల్లంపల్లి పందికుంట యువజన శిక్షణ కేంద్రం జాకారం నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంతాల్లో అవసరమైన చోట్ల వేగ నియంత్రణ పట్టీలు సూచిక బోర్డులు రేడియం స్టికర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.జాతీయ రహదారికి అనుసంధానమయ్యే రహదారుల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆయా అనుసంధాన ప్రాంతాల వద్ద వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా సూచిక హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ టి ఓ ఈశ్వర్ సింగ్ ఠాగూర్ నేషనల్ హైవే ఆర్ అండ్ బి పి ఆర్ ఇంజనీరింగ్ అధికారులు ఎక్సైజ్ సి ఐ సుధీర్ కుమార్ మునిసిపల్ కమిషనర్ సంపత్ ఆర్టి సి పోలీస్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333