ఏటూరునాగారంలో బి.ఆర్.ఎస్ పార్టీ సన్నాహక సమావేశం సభ

Aug 29, 2026 - 21:41
 0  24
ఏటూరునాగారంలో బి.ఆర్.ఎస్ పార్టీ సన్నాహక సమావేశం సభ

కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలన పై ములుగు జిల్లా నియోజకవర్గంలో విస్తృత పోరుబాట

జిల్లా అధ్యక్షులు కాకుల మర్రి లక్ష్మణ్ బాబు

ముక్కుగు జిల్లా, ఆగస్టు 29 : కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల హామీల వైఫల్యాలను ప్రజలకు చేసిన మోసాన్ని ఎండగడుతూ బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు  పిలుపు మేరకు ఏటూరునాగారం మండల కేంద్రంలోని (ఎస్ .ఎల్ .ఎన్ గార్డెన్స్ ) లో బి.ఆర్.ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు కార్యకర్తల సన్నాహక సమావేశం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించబడింది.ఈ సమావేశానికి బి.ఆర్.ఎస్ పార్టీ ములుగు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఖాజా పాషా అధ్యక్షత వహించగా ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు   నాయకత్వంలో జిల్లా నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.సమావేశంలో ఖరారు చేసిన 1000 రోజుల విఫల పాలన నిరసన కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు, 420 హామీలలో ఒక్కటి కూడా సరైన రీతిలో నెరవేర్చలేదని ప్రజలకు బాకీ ఉన్న హామీలపై సెప్టెంబర్ లో చేపట్టే వారం రోజుల పోరుబాటను విజయవంతం చేయాలని ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పిలుపునిచ్చారు.లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ   ములుగు జిల్లా కేంద్రాల్లో భారీ ధర్నాలు 6 గ్యారంటీల వైఫల్యంపై నిలదీత 420 ఫ్లెక్సీల ప్రదర్శన ఇంటింటికీ బాకీ కార్డుల పంపిణీ.  వ్యవసాయం సాగునీరు విద్యుత్ యూరియా కొరత రైతుభీమా సమస్యలపై ములుగు జిల్లా వ్యాప్తంగా రైతు సదస్సులు 22A నిషేధిత భూముల సమస్యలపై ధర్నాలు. మహిళలకు  రూపాయలు 2,500 ఆర్థిక సాయం కేసీఆర్ కిట్ కల్యాణలక్ష్మితో తులం బంగారం అమలుకై మహిళలు వృద్ధులు వికలాంగులతో సదస్సులు  ప్రభుత్వ నిరసనగా వంటా వార్పు ఫీజు రీయింబర్స్‌మెంట్ జాబ్ క్యాలెండర్ యూత్ డిక్లరేషన్ సాధన కొరకు జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు యువతతో భారీ ర్యాలీలు గ్రామాల్లో పల్లెల వినాశనం పడకేసిన పారిశుధ్యానికి నిరసనగా గ్రామస్థాయి నిరసన కార్యక్రమాలు 420 హామీల మోసంపై జిల్లా మండల ప్రజావాణి కేంద్రాల్లో ఫిర్యాదులు వినతిపత్రాల సమర్పణ జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాల సమర్పణ 7 రోజుల పోరాటాలపై ముగింపు ప్రెస్ మీట్ లు చేయాలని వారు ఈ సందర్భంగా
పిలుపునివ్వడం జరిగింది
ఏటూరునాగారంలో జరిగిన ఈ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో ములుగు జిల్లా నియోజకవర్గ పరిధిలోని వాజేడు వెంకటాపురం ఏటూరునాగారం మంగపేట కన్నాయిగూడెం తాడ్వాయి  తదితర మండలాలకు చెందిన పార్టీ మండల అధ్యక్షులు స్థానిక ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు మరియు పార్టీ ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు._

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333