జములమ్మ తల్లీ కరుణించమ్మా...
భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం
అమ్మవారిని దర్శించుకున్న 20 వేల మంది
జోగులాంబ గద్వాల జిల్లా
జమ్మిచెడు జమ్ములమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి మంగళవారం పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ కట్టారు. తెల్లవారుజామున ఐదు గంటల నుండే భక్తుల తాకిడి పెరిగింది. జములమ్మ తల్లీ కరుణించవమ్మా.. అంటూ భక్తిభావంతో ఊగిపోయా రు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. బైనోళ్లు, కుర్వడోళ్ల చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో జములమ్మ తల్లీ.. దీవనలు ఇవ్వమ్మా.. అంటూ భక్తులు అమ్మవారిని కొలిచారు. సాయంత్రం వరకు 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఈవో పురేందర్ తెలిపారు. ఆలయ చైర్మన్ సతీష్‌కుమార్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు.అమ్మవారి దర్శనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది.