చేపల చెరువుల నిర్మాణాలు ఆపాలి

Jan 24, 2026 - 19:56
 0  1
చేపల చెరువుల నిర్మాణాలు ఆపాలి

 జోగులాంబ గద్వాల 24 జనవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఎర్రవల్లి మండలం మళ్లీ మొదలుపెట్టిన చేపల చెరువులు అధికారులు బడా నాయకుల కనుసైకిలో నడుస్తుందన్న గ్రామస్తులు * నీట మునిగిన భూముల్లో చెరువులు వేయకుండా ఆపాలని గ్రామ సర్పంచ్ రేణుక వైఫ్ అఫ్ బిసన్న మరియు ఉప సర్పంచ్ దినకర్ గ్రామ రైతులు ఎమ్మార్వో కి వినతి పత్రం అందించడం జరిగినది*శ్రీశైలం నీటి ముంపుకి గురైన భూముల్లో చేపల చెరువులు.
-అధికారులు,రాజకీయ నాయకుల కనుసన్నలో .
-ప్రభుత్వం నిషేధించిన క్యాట్ ఫిస్ లు పెంపకం.
-ఆందోళనలో గ్రామ ప్రజలు. 
-వివరణ ఇవ్వని జిల్లా ఫిషరీష్ అధికారిని.
-జిల్లా కలెక్టర్ తక్షణమే అక్రమ చేపల చెరువు నిర్మాణమును ఆపాలి.
 జిల్లా ఫిష్ అధికారి షకీలా భాను మరియు ఎర్రవల్లి ఎమ్మార్వో నరేష్ కాల్ లో మాట్లాడడం జరిగింది.నీట మునిగిన చెరువులను ఆపడానికి మండల గెజిటెడ్ ఆఫీసర్ ఎమ్మార్వో కే పర్మిషన్ ఉంటుందని ఫిష్ అధికారి చెబుతుంది ఎమ్మార్వో  నాకు లేదు అధికారం కలెక్టర్ కుంటుందని అంటున్నాడు ఆపే అధికారం ఎవరికి ఉంది అని ప్రశ్నించిన రిపోర్టర్ .

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల పరిధిలోని సాసనూలు గ్రామంలో శ్రీశైలం ముంపుకు గురైన ప్రభుత్వ భూమిలో చేపల పెంపకమునకు మండల,జిల్లా స్థాయి అధికారులతో పాటు బడా రాజకీయ నాయకులు చేపల చెరువును తవ్వుటకు రంగం సిద్ధం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. నీట మునిగిన భూముల్లో దాదాపుగా 110 చెరువులు శ్రీశైలం నీటి ముంపులో గురై ఉన్న భూముల్లో చెరువులు వేసి ఉన్నారు 
1979లో అవార్డు అయిన భూములకు 1983-84 లో ప్రభుత్వము  భూములకు ప్రభుత్వము నష్టపరిహారం చెల్లించిందనీ,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా,పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా చేసే టప్పుడు రెండోసారి కూడా డబ్బులు చెల్లించిందనీ,నీటి ముంపు గ్రామాలకు  రెవెన్యూ  అధికారులు ఇంతవరకు 110 చెరువులకు పర్మిషన్ ఇవ్వకున్నా నడుస్తున్నాయనీ, మళ్లీ ఇప్పుడు శ్రీశైలం నీటి ముంపు పొలాల్లో మూడు హిటాచీ, జెసిబిలతో  మొదలుపెట్టిన అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ చెరువుల వలన  పట్టా పొలాల్లో నీరు వస్తున్నాయని ఆందోళన చెందుతున్న నిరుపేద రైతులు మండల జిల్లా స్థాయి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని, 
ముంపు భూమిలో చెరువులు చేస్తున్న చూచి చూడనట్టు అధికారులు,పట్టా భూముల్లోకి శ్రీశైలం బ్యాక్ వాటర్ వస్తుందని పట్టాదారులు ఆందోళన చెందుతున్నారనీ, దీనిపై విచారణ చేయమని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోని రెవెన్యూ అధికారులు దీనిపైన తక్షణమే చర్య తీసుకుని విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ ని కోరుతున్న గ్రామ ప్రజలు, పట్టదారులు, క్యాట్ పీస్ చాపల చెరువు వలన గ్రామంలో ఉండే పశువులకు,మేకలకు,  గొర్రెలకు, బర్రెలకు కృష్ణా నది నీళ్లు పోయాక గ్రామంలో ఉండే పశువులు, మేకలు కలుషిత నీటి వలన ప్రమాదానికి గురి అవుతున్నాయనీ, పశువుల, గొర్రెల, మేకలు ,బర్రెలు కాపల దారులు   కూడా ఆందోళన చెందుతున్నారు. రైతుల పంట పొలాలకు  మోటర్ ద్వారా పైపులు పంటలు పండిస్తూ ఉంటారనీ, చేపల చెరువుల వలన అనేక నష్టాలు జరుగుతాయనీ, అనధికారికంగా నిర్మిస్తున్న చేపల చెరువుల పనులను ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన తోపాటు , కలెక్టర్ కార్యాలయమును కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఆ గ్రామ ప్రజలు అనుకుంటున్నాట్లు తెలుస్తుంది. 
ఈ విషయంపై జిల్లా ఫిషరీస్ అధికారిని షకీలా భానును వివరణ కోరగా మీరు జిల్లా ఫిషరీస్ కార్యాలయానికి వచ్చి సమాచార అడగాలని దాటవేస్తున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ విషయము సున్నితంగా ఉన్నప్పుడే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని అనధికారికంగా నిర్వహిస్తున్న  చేపల చెరువుల నిర్మాణం ను ఆపాలని ఆ గ్రామస్తులు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333