విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే దీపాలు ఆరిపోవడం బాధాకరం
ఉపాధ్యాయునుల సంతాప సభలో ఎమ్మెల్యే మందుల సామెల్
తుంగతుర్తి 25 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే దీపాలు వృత్తి నిర్వహణలో భాగంగా పాఠశాలకు వస్తున్న క్రమంలో కారు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు.శనివారం మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి బోయిన లింగయ్య అధ్యక్షతన ఇటీవల కారు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధ్యాయుల సంతాప సభలో పాల్గొని మాట్లాడారు, ఉపాధ్యాయులు సమాజంలో ఉన్న చెడులు తొలగించి బావి భారత పౌరుల జీవితాల్లో వెలుగులు నింపే దీపాలు ఆరి పోవడం బాధాకరం అని అన్నారు, ఈ మేరకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కస్తూరిబా ప్రిన్సిపాల్ కల్పన, రావులపళ్లి ప్రధానోపాధ్యాయురాలు గీతారెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడుతానని అన్నారు. ఉపాధ్యాయుల సేవలు సమాజానికి అమూల్యమని, వారి అకాల మరణం విద్యారంగానికి తీరని లోటని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మృతులకు చేరో రూ.లక్ష ఆర్ధిక సాయం తో పాటు గాయపడిన ఉపాధ్యాయులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయడంతో పాటు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సభలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, తిరుమలగిరి సింగిల్ విండో చైర్మన్ పాలేపు చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ వసంత, వివిధ ఉపాధ్యాయ సంఘాల మండల బాధ్యులు పోతరాజు చంద్రశేఖర్, సూర్య ప్రకాష్, నవీన్ ప్రసాద్, కార్తీక్ రెడ్డి, రవిశంకర్, చిలక శ్రీనివాస్, గుజ్జ భాస్కర్, పట్టణ అధ్యక్షుడు ఉప్పుల రాంబాబు,జిల్లా నాయకులు దాసరి శ్రీను, దాయం ఝాన్సీ రాజిరెడ్డి, మాచర్ల అనిల్,సంగెం గ్రామ సర్పంచ్ కలకోట్ల మల్లేష్,వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, మృతుల కుటుంబ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.