చెక్ పోస్ట్ వద్ద 24/7 పగడ్బందీగా తనిఖీలు
అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలి: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు 24/7 పగడ్బందీగా అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలి అని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) గారు తెలిపారు.
ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ గారు గోదావరిఖని లోని గోదావరి బ్రిడ్జి వద్ద చెక్ పోస్ట్ మరియు జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి అక్కడ విధుల్లో ఉన్న పోలీసులతో కలిసి వాహనాలను తనిఖీ నిర్వహించారు. చెక్ పోస్ట్ వద్ద వచ్చిపోయే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, బస్సులను, ద్విచక్ర వాహనాలను సైతం తనిఖీ నిర్వహించాలని సూచించారు. వాహనాల తనిఖీలు నిర్వర్తించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాత్రి సమయంలో రేడియం జాకెట్స్ ఉపయోగించాలని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి అక్రమంగా డబ్బు, మద్యం, బంగారం విలువైన వస్తువులు తరలిస్తుంటే పట్టుకోవాలని సూచించారు. 50వేల రూపాయల కంటే ఎక్కువ అమౌంట్ తీసుకెళ్తుంటే తగిన ధ్రువపత్రాలు లేకపోతే అమౌంట్ సీజ్ చేసి గ్రీవెన్స్ కమిటీకి అప్పగించాలని సూచించారు. 10 లక్షల కంటే ఎక్కువ అమౌంట్ సీజ్ చేస్తే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కు సబ్మిట్ చేయాలని సీపీ గారు తెలిపారు.
చెక్ పోస్ట్ దగ్గర విధుల్లో ఉండే పోలీసులకు కావలిసిన అవసరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
సీపీ గారి వెంట గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, సీఐ ఇంద్ర సేన రెడ్డి, తదితరులు ఉన్నారు.