చిన్నమారుర్ గ్రామంలో ఎస్సీ కాలనీ ఇళ్ల మధ్య నిలిచిన వర్షపు నీరు

Aug 22, 2025 - 19:52
 0  64
చిన్నమారుర్ గ్రామంలో ఎస్సీ కాలనీ ఇళ్ల మధ్య నిలిచిన వర్షపు నీరు

విజృంభిస్తున్న దోమలు, అంటు వ్యాధులు 

 ఎస్సీ కాలనీ సందర్శించిన బిజెపి రాష్ట్ర నాయకులు కురువ చిన్న మల్లయ్య

 నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ సెక్రెటరీ జగ్గారి శ్రీధర్ రెడ్డి 

 చిన్నంబావి మండల అధ్యక్షులు బొగ్గు కురుమయ్య 

 మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కత్తి జానీ 


చిన్నంబావి మండలం తెలంగాణ వార్త : చిన్నంబావి మండల పరిధిలోని చిన్నమారూర్ గ్రామంలో ఎస్సి కాలనీలోని ఇళ్ల మధ్యలో వర్షపు నీరు మరియు జూరాల నీరు నిలిచి దుర్వాసనతో ప్రజలు అల్లాడుతున్న విషయము తెలుసుకున్న బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులు, చిన్నమారుర్ గ్రామంలోని ఎస్సీ కాలనీ సందర్శించారు. రాష్ట్ర నాయకులు కురువ చిన్న మల్లయ్య మాట్లాడుతూ పారిశుద్ధ్యం పై నిర్లక్ష్యం వహిస్తున్న గ్రామ పంచాయతీ సెక్రటరీ వర్షపు నీటి నిలువలను దారి మళ్లించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన అధికారులు నిమ్మకు నీరేతిన్నట్టు ఉండటం బాధాకరమైన విషయమని అన్నారు. వర్షపు నీటి నిలువను దారి మళ్లించి ఎలాంటి అంటువ్యాధులు బారిన పడకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లాలి, క్లోరిన్ పిచ్చికారి చేయాలని అన్నారు. గ్రామానికి రెగ్యులర్ పంచాయతీ సెక్రెటరీ లేకపోవడం గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులకు గమనించాల్సిన అధికారులు లేకపోవడం చాలా బాధాకరం అని అన్నారు. గత 40 సంవత్సరాలు పైబడి చిన్నమారుర్ ఎస్సీ కాలనీ ప్రజలు ఊరు విడిచి కొత్తగా స్థిరపడినా, ఇప్పటిదాకా ప్రభుత్వాలు గానీ, నేతలు గానీ పట్టించుకోకపోవడం రాష్ట్ర బిజెపి కురువ చిన్న మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నంబావి మండల అధ్యక్షులు బొగ్గు కురుమయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వ మారిన గెలిచిన వారు ఈ ఊరిని ఒక్కసారి కూడా చూసే ప్రయత్నం చేయలేదు అని ఒకవేళ అలా చేస్తే ఈ కాలనీ ఇలా ఉండే పరిస్థితి ఉండకపోవచ్చు అని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో రోడ్లపై వర్షపు నీరు, ఇండ్ల మధ్యన వర్షపు నీరు, మురికినీరు చేరి దుర్వాసనతో దోమల కాటుకు అనారోగ్య బారిన పడుతున్న ప్రజల ఇబ్బందులను గుర్తించని మండల అధికారులు అని అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ సెక్రెటరీ జగ్గారెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సొంత మండలం అయిన మంత్రి గారు ఒక్కసారైనా చిన్న మారుర్ గ్రామానికి వచ్చి ఎస్సీ కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను నిలువ ఉన్న మురికి నీటిని, దుర్వాసన వస్తున్న ప్రజలు జీవిస్తున్న జీవన విధానాన్ని గమనించి సమస్యలను పరిష్కారం చేయాలని ఎస్సీ కాలనీ లోనికి వర్షపు నీరు మరియు జూరాల నీరు రాకుండా తక్షణమే మరమ్మతులు ఏర్పాటు చేయాలని అధికారులను, నాయకులను ఈ సందర్భంగా కోరారు. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు మంత్రిగా ఉన్నారు. సొంత మండలంలోని చిన్నమారుర్ గ్రామం సందర్శించి ఎస్సీ కాలనీలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కారం చేయాలని కోరారు. ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి. ఇప్పటికే భూములు ఉన్నవారికి మరియు ఇండ్లు ఉన్న వారికి ఇళ్లు కేటాయించడం అన్యాయం. నిజంగా పేద ప్రజానీకానికే ఇళ్లు లభించేలా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంలో గ్రామస్తులు విద్యుత్ సమస్యలపై కూడా ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో విద్యుత్తు సరఫరా అస్త వ్యస్తంగా ఉంది. రోడ్ల వెంట విద్యుత్ బల్బులు వెలగడం లేదు. గ్రామపంచాయతీ సెక్రటరీ లేక పోవడంతో సమస్యలు పరిష్కరించబడడం లేదు. చీకట్లో మేము జీవించడం తప్పదా అని వాపోయారు. చిన్నమారుర్ ఎస్సీ కాలనీ ప్రజలు మంచి రోజులు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో SC మోర్చా మండల అధ్యక్షుడు కత్తి జానీ, వనపర్తి జిల్లా ఓబీసీ కార్యదర్శి మేకల చెన్నయ్య యాదవ్, ఉపాధ్యక్షులు గణేష్ రెడ్డి, ఉగ్ర నరసింహ, హిట్లర్ నరసింహ, తగరం నాగరాజు, డిఎన్ రాము, తగరం కృష్ణయ్య, గ్రామ నాయకులు రామకృష్ణ, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333