చిన్నంబావి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ హాస్టల్ సందర్శించిన బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు కురువ మల్లయ్య 

Aug 23, 2025 - 19:57
 0  10
చిన్నంబావి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ హాస్టల్ సందర్శించిన బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు కురువ మల్లయ్య 

నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ సెక్రటరీ జగ్గారి శ్రీధర్ రెడ్డి 

చిన్నంబావి మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య 

చిన్నంబావి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు కత్తి జానీ 

చిన్నంబావి మండలం తెలంగాణ వార్త : చిన్నంబావి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ ను చిన్నంబావి మండల బిజెపి పార్టీ మండల అధ్యక్షులు బొగ్గు కురుమయ్య ఆధ్వర్యంలో బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్లో సందర్శించారు. హాస్టల్లో విద్యార్థుల వసతి పరిస్థితులు తెలుసుకుంన బిజెపి పార్టీ నాయకులు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు కురువ చిన్న మల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని, చదువుతో పాటు విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేలా శుభ్రమైన వసతి, పరిసరాల పరిశుభ్రత ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం తక్షణమే అన్ని ప్రాథమిక సౌకర్యాలను విద్యార్థులకు కల్పించాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లా బిజెపి పార్టీ జనరల్ సెక్రెటరీ జగ్గారి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బంది పరిసరాల పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి పెట్టాలని హాస్టల్ ప్రాంగణంలో ఆపరిశుభ్రత గుర్తించిన వెంటనే అధికారులను సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు స్వచ్ఛమైన వాతవరణంలో చదివితేనే నిజమైన అభ్యాసం సాధ్యమవుతుందని గుర్తు చేశారు. విద్యార్థులను ప్రోత్సహించి మంచి క్రమ శిక్షణ మంచి అలవాట్లు అలవర్చుకునే విధంగా ఉపాధ్యాయులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్నంబావి మండల బిజెపి పార్టీ అధ్యక్షులు బొగ్గు కురుమయ్య విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి సమస్యలు ఏమైనా ఉన్నాయా, మంచి ఆహారం అందిస్తున్నారా లేదా నాణ్యమైన కూరగాయలు ఇస్తున్నారా లేదా, అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ క్రమశిక్షణతో చదువుకుంటే భవిష్యత్తులో మంచి స్థాయి సాధించవచ్చని ప్రోత్సహించారు. వారిలో ఉన్న ప్రతిభను పెంపొందించేందుకు తగిన వనరులు అందించడం అవసరమని పేర్కొన్నారు. హాస్టల్ పూర్తిగా పరిశీలించిన బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, వివిధ గ్రామాల నాయకులు, హాస్టల్ పరిసర ప్రాంతాలను పరిశీలన చేసి పరిసరాలలో నీరు నిల్వ ఉండ కుండ ఏర్పాట్లు చేయాలని, పిచ్చి మొక్కలను చెత్తచెదారని తక్షణమే తొలగించాలని వీటివల్ల విద్యార్థులు దోమలకాటుకు గురై అనారోగ్యం పాలు అవుతారని, కాంపౌండ్ వాల్ పనులు త్వరగా పూర్తి చేసి పరిశుభ్రంగా ఉంచే విధంగా ఉపాధ్యాయులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కరెంటు ట్రాన్స్ఫారం కాంపౌండ్ లోపల ఉంటే ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ట్రాన్స్ఫారం  కాంపౌండ్ బయట ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు కురువ చిన్న మల్లయ్య, నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ సెక్రటరీ జగ్గారెడ్డి, చిన్నంబావి మండల అధ్యక్షులు బొగ్గు కురుమయ్య, చిన్నంబావి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు కత్తి జానీ, మండల జనరల్ సెక్రెటరీ డిఎన్ రాము, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు గణేష్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333