ఉపాధ్యాయ ఉద్యోగులపై అమలు చేస్తున్న సీపీస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి

Aug 23, 2025 - 19:56
 0  12
ఉపాధ్యాయ ఉద్యోగులపై అమలు చేస్తున్న సీపీస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి

చిన్నంబావి మండలం తెలంగాణ వార్త  : చిన్నంబావి మండల కేంద్రంలోని టీపియుస్ చిన్నంబావి మండల అధ్యక్షుడు అనుకలి శివ రాముడు ఆధ్వర్యంలో చిన్నంబావి మండలం లోని వివిధ గ్రామాల ఉపాధ్యాయులు ఉద్యోగుల కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చిన్నంబావి మండల తాసిల్దార్ కార్యాలయంలో చిన్నంబావి మండల ఉపాధ్యాయ సంఘాలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులు, ఉద్యోగులపై అన్యాయంగా అమలు చేస్తున్న సీపీస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ) ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయుస్) డిమాండ్ చేస్తోంది. టీపీయుస్ నాయకులు పేర్కొంటూ, “2004 ఆగస్టు 23న వెలువడిన చీకటి జీవో నం. 28 ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులోకి వచ్చిన కొత్త పెన్షన్ విధానం ఉపాధ్యాయ ఉద్యోగుల పట్ల తీవ్ర అన్యాయం 2023 డిసెంబర్ ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 100 రోజులలోపే సీపీస్ రద్దు చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి అని తెలిపారు. ఈ మేరకు చిన్నంబావి మండల తహసీల్దార్ కార్యాలయంలో శ్రీ జి. రాజవర్ధన్, ఆర్ ఐ రాజవర్ధన్ కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీయుస్ జిల్లా కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్, శ్రీలక్ష్మీ, శైలజా, సీనియర్ సభ్యులు శ్రీనివాసమూర్తి, మండల అధ్యక్షుడు అనుకలి శివరాముడు, శివలీల, షబానా, వనిత, గాయత్రి, సాయికుమారి, నరేందర్, రాఘవేంద్ర, మధు, రవి, సంజీవ్, రాజు, గణేష్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయుస్ ) చిన్నంబావి

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333