చినుకు పడితే చిత్తడిగా మారుతున్న రోడ్లు... పట్టించుకోని అధికారులు

జోగులాంబ గద్వాల 30 మే 2025 తెలంగాణ వార్తా పత్రిక: గద్వాల. మండలం లోని కోండపల్లి రోడ్డు చాలా దారుణంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే వర్షం పడినప్పుడల్లా రోడ్డు పై నీరు పారి చిత్తడినేలగా మారుతుంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురి గురవుతున్నామని వాహనదారుల నుంచి వినిపిస్తున్నాయి.రోడ్డు పై బురద బురదగా మారడంతో పాటు నీరు నిల్వ ఉండటం జరుగుతుంది. దీంతో వాహనదారులు కోన్ని సార్లు కిందపడటం జరుగుతోందని వాహనదారులు వాపోతున్నారు. గద్వాల నుండి శాంతినగర్ కి, షాబాద్ కి ముఖ్యమైన రూట్ కావడంతో చాలా మంది ప్రయాణికులు, వాహనాలు ఈ రహదారి గుండా వేళ్తు ఉంటాయి. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.