ఉదరతను చాటుకున్న బి.అర్.కే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు
15 నెలల బాబుకు లివర్ ప్రాబ్లం
దాతలు ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు అనే కథనానికి స్పందించిన...
మానవసేవయే మాధవసేవ గ్రూప్ మరియు ఇతర గ్రూపుల ద్వారా దాతల సహాయం ద్వారా వచ్చిన 26,000/- వేల రూపాయలను కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో తండ్రి మల్దకంటి కు అందించిన బి.ఆర్.కె న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు...
గత కొన్ని రోజులుగా 15 నెలల బాబుకు లివర్ ప్రాబ్లం దాతల ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు... అనే కథనం సోషల్ మీడియా ద్వారా మరియు పత్రికలలో రావడం జరిగింది. సోషల్ మీడియాలో పత్రికలలో వచ్చిన ఈ కథనానికి మానవసేవయే మాధవసేవ గ్రూప్ మరియు ఇతర గ్రూపుల ద్వారా దాతలు సహాయ సహకారాలు అందించిన మొత్తం నిధి 26,000 జమ కాగా.... అట్టి 26,000 రూపాయల మొత్తాన్ని కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 నెలల బాబు కింగ్ జాన్సన్ విక్టరీ తండ్రి అయిన
మల్దకంటి కు బి ఆర్ కే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు ఇట్టి అమౌంటును అందజేయడం జరిగింది. బాబు ఆపరేషన్కు 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఇంకా ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకుంటే ఈ క్రింద ఫోన్ పే నెంబర్ 9000877030 కు దాతల ఆర్థిక సహాయం అందించి సహాయపడగలరని సోషల్ మీడియా గ్రూప్ ద్వారా కోరడం జరిగింది...
ఇప్పటివరకు దాతల సహాయ సహకారంతో 26,000 రూపాయలు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు బాబు కుటుంబ సభ్యులు. అదేవిధంగా ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు బి ఆర్ కే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు.