ఘోర రోడ్డు ప్రమాదం యువకుడు మృతి

Jan 30, 2026 - 21:55
 0  616
ఘోర రోడ్డు ప్రమాదం యువకుడు మృతి

నాగారం 30 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:

నాగారం మండలం పరిధిలోని నాగారం బంగ్లా హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద డీసీఎం ను ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి 7.30 నిమిషాలకు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. వర్ధమానుకోట గ్రామానికి చెందిన గుండు మల్లేష్(26) పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై తిరుమలగిరికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో నాగారం బంగ్లా హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన క్రషర్, తారు ప్లాంటుకు సంబంధించిన డీసీఎం రోడ్డు పక్కకు అజాగ్రత్తగా నిలపడం వలన గమనించని ద్విచక్ర వాహనదారుడు డీసీఎం ను ఢీ కొట్టగ తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మరణించాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.

ప్రమాదానికి అసలు కారణం క్రషర్ ప్లాంటే..

రహదారి 360 బి పై మరమ్మత్తులు చేయడానికి రోడ్డు కాంట్రాక్టర్ యాజమాన్యం తాత్కాలిక క్రషర్, తార్ ప్లాంటును ఏర్పాటు చేశారు. ప్లాంటు యాజమాన్యం మిల్లు నుండి లోడ్ వాహనాలు బయటకు వచ్చే సమయంలో ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఇద్దరు వ్యక్తులను నియమించుకుని ట్రాఫిక్ ను నియంత్రిస్తూ క్రషర్ ప్లాంటు నుండి వచ్చే, వెళ్ళే వాహనాలను రోడ్డు దాటించాలి. కానీ సదరు సంబంధిత ప్లాంటు యాజమాన్యం ఇవేమీ పట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి వాహనాన్ని రోడ్డు పై రెయిలింగ్ ఉన్నచోట అజాగ్రత్తగా నిలపడం వలన అదే సమయంలో అటుగా వస్తున్న ద్విచక్ర వాహనదారుడు గమనించకపోవడంతో నేరుగా వెళ్లి ప్లాంటుకు సంబంధించిన డీసీఎం ను వెనకాల నుండి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలవగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన ప్లాంటును వెంటనే తొలగించాలని మండల ప్రజలు కొరరూ.... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి