ఘనంగా వసంత పంచమి దినోత్సవ వేడుకలు
జోగులాంబ గద్వాల 24 జనవరి 2026తెలంగాణ వార్త ప్రతినిధి : ఎర్రవల్లి. మండల కేంద్రంలోని ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ (సీబీఎస్ఈ) స్కూల్ నందు వసంత పంచమి సందర్భంగా చిన్నారులతో కలిసి అమ్మవారికి పూలమాల వేసి పూజ కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి మధులిక గోవర్ధన్ రెడ్డి మొదటగా చిన్నారులకు మరియు ఉపాధ్యాయ బృందానికి వసంత పంచమి శుభాకాంక్షలు అంటూ చిన్నారులకు ఆ అమ్మవారి దీవెనలు ఆశీర్వాదాలు ఎల్లప్పుడు చిన్నారుల మీద ఉండాలంటూ సకల విద్య స్వరూపిని పరాశక్తి జ్ఞాన ప్రధాని శ్రీ సరస్వతి దేవి అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రతి ఒక్కరికి లభించాలని కోరుకున్న పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి మధులిక గోవర్ధన్ రెడ్డి అనంతరం చిన్నారులతో వసంత పంచమి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ మహిమ శ్రీ పాఠశాల అధ్యాపక బృందం మాధవి, శ్రీదేవి, రేవతి, ప్రియాంక, సౌజన్య, సురక్షిని, నాగరాజు, మరియు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.