3కోట్ల 43 లక్షల రూ" తో సబ్ స్టేషన్ కు శంకుస్థాపన..లో వోల్టేజ్ పరిష్కరిస్తా..ఎమ్మెల్యే మందుల సామేల్

Jan 24, 2026 - 19:47
 0  68
3కోట్ల 43 లక్షల రూ" తో సబ్ స్టేషన్ కు శంకుస్థాపన..లో వోల్టేజ్ పరిష్కరిస్తా..ఎమ్మెల్యే మందుల సామేల్

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కరెంటు లోవోల్టేజ్ సమస్య పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. శనివారం మండలంలోని కోటమర్తి గ్రామంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోవోల్టేజ్ సమస్య పరిష్కారానికి సబ్ స్టేషన్ మంజూరు చేయించానని తెలిపారు.3కోట్ల 43లక్షల వ్యయంతో సబ్ స్టేషన్ నిర్మాణం రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు చూచించారు.పూర్వం డిస్ మెటల్ లైన్లను మార్చి కొత్తలైన్లు వేసి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని కోరారు.ఈకార్యక్రమంలో ఏడి బాలునాయక్,డిఈ వెంకటేశ్వర్లు,ఎస్ఈ సురేష్,ఏఈ ఉమానాయక్ కాంగ్రెస్ పార్టీ మండలపార్టి అధ్యక్షులు నిమ్మనగోటి జోజి,తహశీల్దార్ శేషగిరిరావు,సర్పంచ్ లు పాశం విష్ణువర్ధన్ ,చిత్తలూరి సోమనారాయణ, రాజకొండ రమేష్, ముక్కాంముల శ్రీకాంత్, చేడే అంబెడ్కర్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాశం సత్యనారాయణ, చిత్తలూరి సోమన్న ,బొమ్మగాని లక్ష్మయ్య, వల్లంభట్ల రవిందర్ రావు ,కంబాల వీరయ్య, చిత్తలూరి హనుమంతరావు,లింగాల నర్సిరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333