ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 

Jan 26, 2025 - 21:37
 0  4
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు 

జోగులాంబ గద్వాల 26 జనవరి 25 తెలంగాణ వార్తా ప్రతినిధి.

ఐజ
* ఏఐసీసీ కార్యదర్శి, ఛత్తిస్ ఘడ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, అలంపూర్ మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ. డాక్టర్ ఎస్. ఏ. సంపత్ కుమార్. * ఆదేశాల మేరకు..
     76వ గణతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని ఐజ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో... 
  ఐజ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాస్టర్ మధుకుమార్ మువ్వన్నెల జాతీయ జెండాను...పాత బస్టాండ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందర ఎగురవేశారు.
   ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావలి ఆచారి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....
    ఈ చారిత్రాత్మక దినం మన రాజ్యాంగం ఆవిష్కరణను మరియు ఆది న్యాయం, స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ప్రోత్సహిస్తోందని....
 దేశం గర్వపడే పౌరులుగా, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గౌరవించడం, దేశాన్ని మరింత బలంగా, ఐక్యంగా, శ్రేయస్సుగా నిర్మించడం మన బాధ్యత అని..
  
    ఈ రోజు ప్రజాస్వామ్య శక్తిని గుర్తు చేస్తూ, దేశాభివృద్ధికి కృషి చేయాలని మనకు ప్రేరణ ఇస్తుంది. మన గణతంత్ర లక్ష్యాలను గౌరవించాలని,
 ఐజ పట్టణ మరియు మండల ప్రజలకు ఈ సందర్బంగా వారు శుభాకాంక్షలు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో... ఐజ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వివిధ వార్డుల ఇన్చార్జ్ లు, కార్యకర్తలు,కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333