ఉద్యోగవిరమణ పొందిన సీనియర్ అసిస్టెంట్ నాగేందర్ రావు.

Jun 1, 2024 - 04:56
Jun 1, 2024 - 05:05
 0  3
ఉద్యోగవిరమణ పొందిన సీనియర్ అసిస్టెంట్ నాగేందర్ రావు.

నాగేందర్ రావు దంపతులను సన్మానించి ఎస్పీ రాహుల్ హెగ్డే

  • సుదీర్ఘకాలం సేవలు అందించడం అభినందనీయం.
  • --- రాహుల్ హెగ్డే ఐపిఎస్, ఎస్పి  సూర్యాపేట.

సూర్యాపేట 31 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఉద్యోగవిరమణ చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ నాగేందర్ రావు దంపతులను వారి కుటుంబ సభ్యుల సమక్షంలో జిల్లా పోలీస్ కార్యలయంలో ఎస్పి రాహుల్ హెగ్డే  సన్మానించారు. నాగేందర్ గారికి వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ పోలీసు డిపార్ట్మెంట్ నందు సుదీర్ఘకాలం సేవలు అందించడం గొప్పవిషయం అని, అభినందనీయం అని వారి సేవలను కొనియాడారు.  ఈ  ఉద్యోవిరమణ అనంతరము వారి కుటుంబ సభ్యుల అందరితో  సుఖ సంతోషలతో గడపాలని అని, ప్రజా సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాము అని తెలిపినారు.

ఈ కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పి నాగేశ్వరరావు, AR అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి, AO మంజు భార్గవి, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్,  సభ్యులు అంజన్ రెడ్డి, వెంకయ్య, DPO సిబ్బంది, ఉద్యోగవిరమణ పొందిన నాగేందర్ గారి కుటుంభం సభ్యులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333