ఘనంగా కొంపెల్లి దశరధ జన్మదిన వేడుకలు
సూర్యాపేట, మార్చి 1 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- శ్రీ వశిష్ట విద్యాసంస్థల అసోసియేటెడ్ డీన్,ప్రముఖ కవి కొంపెల్లి దశరథ జన్మదిన వేడుకలు శుక్రవారం వాణిజ్య భవన్ సెంటర్ వద్ద పూర్వ విద్యార్థులు, స్నేహితులు, బంధువులు, ఆత్మీయ మిత్రులు ఏర్పాటుచేసిన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శాలువా, బొకేలతో ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగాల పురిటి గడ్డ దానధర్మాలకు నిలయమైన భానుపురి సూర్యాపేటలో పుట్టడం అదృష్టమని అన్నారు. సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో జన్మించిన నన్ను భానుపురి లో విద్యార్థులు నేర్పించి బుక్తిని ఇచ్చే జ్ఞానంతో పాటు ముక్తినిచ్చిన కవిత్వం కూడా ఇచ్చిన ఈ నేలలు మర్చిపోనని భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యోగరీత్యా భాగ్యనగరంలో ఉన్న నా ఆత్మకు భాను పూరిపై మక్కువ తగ్గలేదని తెలిపారు ఈ మధ్యనే తనకు ఉన్నతమైన పదవి బాధ్యతలునిచ్చిన శ్రీ విశిష్ట విద్యాసంస్థలకు రుణపడి ఉంటానని నా శక్తి మేర కృషి విద్యా సంస్థల అభివృద్ధికి పాటుపడుతూ సూర్యాపేటలో పేద విద్యార్థిని, విద్యార్థులకు భాసటగా నిలుస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ విశిష్ట విద్యా సంస్థల చైర్మన్ ప్రమీల, జనరల్ మేనేజర్ వంశి చంద్ర చరవాణిలో సందేశం పంపుతూ దశరథ లాంటి వ్యక్తి మా సంస్థలో పనిచేయడం మా సంస్థ విలువలు పెరుగుటకు దోహదపడుతాయని ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ జన్మదిన వేడుకలలో నోబుల్ స్కూలు కరస్పాండెంట్ నామాల గురుమూర్తి, దేశ గాని శ్రీనివాస్ గౌడ్, కారింగుల అజిత్, మధు మీడియా మధు, రాఘవేంద్ర ప్రసాద్ కుమార్, బెల్లంకొండ రామ్మూర్తి,మిట్టకోల యుగేందర్, తదితరులు పాల్గొన్నారు