గ్రామ పంచాయతీ కారోబార్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసహాయం అందించిన
గ్రామ పంచాయతీ వర్కర్స్ &యూనియన్ జేఏసీ మండల అధ్యక్షులు తిప్పర్తి గంగరాజు
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ గ్రామ పంచాయతీ కారోబార్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసహాయం అందించిన గ్రామ పంచాయతీ వర్కర్స్ &యూనియన్ జేఏసీ మండల అధ్యక్షులు తిప్పర్తి గంగరాజు మండల కేంద్రం లోని కందగట్ల గ్రామ పంచాయతీ లో కారోబార్ గా పనిచేస్తూ ఇటీవలే అనారోగ్యం తో మరణించిన బండారు సైదులు గారి చిత్రపటానికి గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ జేఏసీ మండల అధ్యక్షులు తిప్పర్తి గంగరాజు నివాళులు అర్పించారు అనంతరం అన్ని గ్రామ పంచాయతీ ల లోని కార్మికులు అందరూ కలసి జమ చేసిన డబ్బులు 25000/- వారి కుటుంబ సభ్యులకు అందజేసిన అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ బండారు సైదులు గారు మృదు స్వభావి స్నేహశీలి గతం లో జరిగిన సమ్మె లో తన సొంత డబ్బులతో కార్యక్రమాలు నడిపిన గొప్ప వ్యక్తి అని ఆయన లేని లోటు జీర్ణించుకోలేనిది అని బావోద్వేగానికి లోనయ్యారు వారి భార్య కు ఉద్యోగం కల్పించాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు తన్నీరు వెంకన్న, మండల ఉపాధ్యక్షులు మాతంగి నాగయ్య, పబ్బతి వెంకటేష్ నాయకులు బొడ్డు పీటర్, పిడమర్తి ప్రసాద్,సల్వది రాజు, మండలి వీరయ్య, జాన్, నీలం అశోక్, లింగనాయక్ తదితరులు పాల్గొన్నారు