గుడిసెలు లేని రాష్ట్రమే లక్ష్యం

Jul 31, 2026 - 00:00
 0  1
గుడిసెలు లేని రాష్ట్రమే లక్ష్యం

సర్ పేరుతో బిజెపి కుట్రలను తి ప్పి కొట్టేలా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి

 సూర్యాపేట:అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేస్తూ గుడిసెలు లేని తెలంగాణ రాష్ట్రమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఏఐసీసీ సభ్యుడు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సర్ ప్రక్రియ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వికలాంగ కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యతో కలిసి వారు పాల్గొని మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలో సర్ పేరుతో బిజెపి కుట్రలు చేసే అవకాశం ఉందని ప్రతి కార్యకర్త నాయకుడు సర్ ప్రక్రియను విజయవంతం చేయడంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీలకతీతంగా ఏ పార్టీ వ్యక్తి అయిన తన ఓటును పోగొట్టుకోవద్దని ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరికి సర్ ప్రక్రియను పూర్తి చేపిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తీసివేసేలా బిజెపి కుట్రలు చేస్తుందని కార్యకర్తలు నాయకులు  నిత్యం ప్రజల్లో ఉండాలన్నారు. సూర్యాపేటకాంగ్రెస్ కంచుకోటని ఎన్నికలు ఏవచ్చిన కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. సర్ ప్రక్రియలో ఏ ఒక్క ఓటు కూడా గల్లంత కాకుండా చూడాలన్నారు. బిఎల్ఓ లు సూపర్వైజర్లు విజయవంతమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మురిసెట్టి నివేదిత లక్షాధి, డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య,  రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు వెలుగు వెంకన్న,  శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కుమ్మరి కుంట్ల వేణుగోపాల్, కౌన్సిలర్లు,  మండల అధ్యక్షులు, తూ ముల సురేష్ రావు, కోతి గోపాల్ రెడ్డి, ముసుకు రామచంద్రారెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333