గూడెం గ్రామంలో పంచాయతీ సెక్రెటరీ ఆధ్వర్యంలో

ముమ్మరంగా సాగుతున్న కుటుంబ సమగ్ర సర్వే

Nov 18, 2024 - 19:47
Nov 18, 2024 - 19:49
 0  80
గూడెం గ్రామంలో పంచాయతీ సెక్రెటరీ ఆధ్వర్యంలో

18-11-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం:- చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామపంచాయతీలో కుటుంబ సమగ్ర సర్వే ఈరోజు సోమవారము వరకు 70 శాతం పూర్తి అయ్యిందని గూడెం గ్రామపంచాయతీ అధికారి విక్రమ్ యాదవ్ తెలియజేశారు. గ్రామంలో ప్రతి కుటుంబం కూడా ఇన్వెటర్లను బాగా సహకరిస్తున్నారని గ్రామంలో ఏ సమస్య వచ్చినా గ్రామ పంచాయతీ సెక్రెటరీ విక్రమ్ యాదవ్ ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న సమస్యలపై సానుకూలంగా స్పందించి కుటుంబ సర్వేను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.గూడెం గ్రామంలో పంచాయతీ సెక్రెటరీ ఆధ్వర్యంలో సెక్రెటరీ తో పాటు ఇద్దరు ఇన్విటర్లు కుటుంబ సర్వేలో పాల్గొన్నారు.గ్రామంలో మొత్తం 35 కుటుంబాలు ఉండగా ఈరోజుటి వరకు 317 కుటుంబాలను పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా కేవలం38 కుటుంబాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అని విక్రమ్ యాదవ్ తెలియజేశారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State