శివాలయం దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన మంగలి హైమావతి,నాగరాజు
18-11-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో ముక్కు గుల్ల శివాలయం దగ్గర కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని మంగలి హైమావతి/ మంగలి నాగరాజు దంపతులు కొన్ని సంవత్సరాల నుండి కార్తీక మాసంలో ముక్కు గొల్ల శివాలయం దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ముక్కు గుల్ల శివాలయానికి గ్రామ దేవాదాయ కమిటీ అధ్యక్షుడు క్యాథూరి రాముడు,ఉపాధ్యక్షుడు రొడ్డ కురుమయ్య,కోశాధికారి సింగోటం బాలస్వామి ముక్కు గుల్ల శివాలయానికి కార్తిక మాసాన్ని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ కమిటీ నుండి 3000 రూపాయలు పెట్టి శివాలయం చుట్టూ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈరోజు సాయంత్రం 6 గంటల కు దేవాదాయ కమిటీ అధ్యక్షుడు క్యాతూరి రాముడు శివాలయం దగ్గర లక్ష దీపాలను వెలిగించి లక్ష దీపాల కార్యక్రమాన్ని ప్రారంభించాడు.
ఈ యొక్క కార్యక్రమానికి గ్రామంలో నుండి మహిళలు, అధిక సంఖ్యలో పాల్గొని లక్ష దీపాల కార్యక్రమంలో పాల్గొని శివాలయంలో పూజలు నిర్వహించారు.
ఇట్టి కార్యక్రమంలో దేవాదాయ కమిటీ అధ్యక్షుడు క్యాథూరి రాముడు, ఉపాధ్యక్షులు రొడ్డ కురుమయ్య, కోశాధికారి సింగోటం బాలస్వామి తోపాటు
కొన్ని ఏళ్ల నుండి కార్తీక మాసంలో అన్నదానం చేస్తున్నటువంటి దంపతులు, మరియు గ్రామ పెద్దలు, యువకులు, చిన్నారులు ఉపాధ్యాయులుభోజన కార్యక్రమంలో, దీపారాధన కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.