గురుదత్త సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ

జోగులాంబ గద్వాల 5 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల. పట్టణం గాంధీ చౌరస్తా నందు గురుదత్త సేవా సమితి ఆధ్వర్యంలో వేసవికాలం సందర్భంగా ఉచిత చల్లని మజ్జిగ పంపిణీ చేశారు .ప్రతి సోమవారం గద్వాల పట్టణంలో సంత జరుగు సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో గద్వాల పట్టణానికి వస్తూ ఉంటారు. కాబట్టి ఎండ తీవ్రత వల్ల వడదెబ్బకు గురికాకుండా చల్లని మజ్జిగ పంపిణీ చేస్తున్నామని గురుదత్త సేవాసమితి సభ్యులు తెలిపారు.