రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన నిరుపేదలకు ఇల్లు ప్రధాన్యత ఇవ్వాలని బీఎస్పీ డిమాండ్
బీఎస్పీ పార్టీ మిర్యాలగూడ ఇంచార్జ్ పుట్టల దినేష్

తెలంగాణ వార్త మిర్యాలగూడ మే 5 : ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ మిర్యాలగూడనియోజకవర్గ అధ్యక్షులు నాలి నాగరాజు, ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశంలో గ్రామ కమిటీల నిర్మాణం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ బలోపేతం గురించి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జ్ పుట్టల దినేష్, పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ మంజూరు చేసిన మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన నిరుపేదలకు మాత్రమే కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారుగ్రామాలలో భూమిలేని,ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి మొదటి ప్రాధాన్యత వారికే ఇవ్వాలని, కులాల వారిగా, గ్రూపుల వారిగా గ్రామాలలో స్థానిక అధికార పార్టీ నాయకులు వ్యవహరించకుండా ఎటువంటి రాజకీయజోక్యం లేకుండా నిష్పక్షపాతంగా లబ్ధిదారులు ఎంపిక చేయాలని వారు సూచించారుప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ పథకం ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే మొదటి ప్రాధాన్యత అర్హులైన నిరుపేదలకు మాత్రమే ఇవ్వాలని, లబ్ధిదారుల ఎంపిక గ్రామసభ ద్వారా పంచాయతీ కార్యదర్శి ఎంపిక చేయాలని వారు కోరారు. అర్హులైన పేదలకు కాకుండా మిగతా వారిని మొదటి ఎంపికలో గుర్తిస్తే అర్హులైన పేదలతో కలిసి ఆయా గ్రామాలలో, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు గాలిబ్ మరియుతదితరులు పాల్గొన్నారు.