గురుకుల పాఠశాల లో ఆకస్మిక తనిఖీ చేసిన తుంగతుర్తి ఎం ఎల్ ఏ మందుల సామెల్

తుంగతుర్తి మార్చి 3 తెలంగాణ వార్త ప్రతినిధి:- తుంగతుర్తి మండల కేంద్రం లో గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ తనిఖీ చేస్తున్న సమయం లో పలువురు సమయ పాలన పాటించకపోవడంతో అధికారులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు 36 మంది టీచర్లకు ఐదుగురు మాత్రమే టీచర్లు వచ్చారని అధికారులకు సూచించి వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ఆహారం కూడా మంచిగా వండి పెట్టాలని అదేశించారు ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్ సూర్యాపేట జిల్లా నాయకులు సుంకరి జనార్దన్ తుంగతుర్తి మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు