గురుకుల పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో శంకరయ్య
అడ్డగూడూరు 30 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- జిల్లా కలెక్టర్ హనుమంతు ఆదేశాల మేరకు అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన మంగమ్మగూడెం గురుకుల పాఠశాలలో ఎంపీడీవో శంకరయ్య,ఎంపీఓ ప్రేమలత సందర్శించారు.పాఠశాల వంటగదిని,ఆహార పదార్థాలను,మరియు ఆహారాన్ని తనిఖీ చేసి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో పాటు భోజనం చేసిన ఎంపీడీవో శంకరయ్య,ఎంపీవో ప్రేమలత పాఠశాల విద్యార్థినిలను బాగోగులు అడిగి తెలుసుకున్నారు