గిరిజన సంక్షేమ వసతి గృహంలో అదనపు గదులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఆర్టికల్చర్ 275/1 గ్రాండ్స్ ఇన్ ఎయిడ్ నిధులతో నిర్మించు అదనపు వసతిగృహం.
భూమి పూజ చేసిన శాసనసభ్యులు మందుల సామెల్..
తుంగతుర్తి 07 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్ :- తుంగతుర్తి మండల పరిధిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఈరోజు ఆర్టికల్ 275/1 గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ నిధులతో నిర్మించు అదనపు వసతిగృహం టాయిలెట్స్ బ్లాక్ మరియు వంటగది కం డైనింగ్ హాల్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ చేసిన శాసనసభ్యులు మందుల సామెల్ మాట్లాడుతూ. తెలంగాణ గురుకుల పాఠశాలలో నాలుగు కోట్ల రూపాయల నిధులను వెచ్చించి గురుకుల విద్యార్థులకు బాత్రూంలో భోజన వసతులకు పెద్ద హాలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను వెచ్చించడం జరిగిందన్నారు. అదేవిధంగా గురుకులంలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. విద్యార్థులకు నూతన వరవడితో విద్య బోధన చేస్తూ మంచి మార్కులు విద్యార్థులకు వచ్చే విధంగా మంచి ఉపాధ్యాయులు బోధించడంతో వారికి జిల్లాలోనే ర్యాంకులు రావాలని కోరడం జరిగింది. జిల్లా ఆర్ సి ఓ ఇన్చార్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు పాఠశాలకు సమయం పాటించి క్లాసులకు వచ్చి పిల్లలకు మంచి చదువులను నేర్పే విధంగా మీరు పిల్లలతో మమేకమైనప్పుడు మంచి చదువులు వస్తాయని ఆయన పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులను కోరడం జరిగింది.
మన గురుకుల తుంగతుర్తి నియోజకవర్గంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు రాష్ట్రంలో మంచి స్థానం వచ్చిన వారికి 50 వేల రూపాయలు బహుమతి ఇస్తానని ప్రకటించారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలో కావాల్సిన వసతులను ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు మాకు తెలియపరిస్తే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. గురుకులంలో ఖాళీగా ఉన్న పోస్టులను తొందర్లోనే భర్తీ చేస్తామని తెలిపారు. విద్యార్థులు ఈసారి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎస్టీ వారిని ఇంకా చేర్పించుకుంటామని తెలిపారు. ఇప్పటికీ పాఠశాలలో 580 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వారికి అన్ని వసతులతో పాటు కాస్మోటిక్ వస్తువులను కూడా పంపిణీ చేయడం జరిగింది అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యా శాఖ మంత్రి ఉండటం చాలా గర్వకారణం అన్నారు.
వారు చేసే కృషితో మన రాష్ట్రంలో విద్య వైద్య సౌకర్యాలకు అధిక నిధులను వెచ్చిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గిరిధర్ రెడ్డి . వైస్ చైర్మన్ చింతగండ్ల వెంకన్న పిఎసిఎస్ చైర్మన్ గుడిపాడు సైదులు పలు మండలాల మండల శాఖ అధ్యక్షులు తిరుమలగిరి సుంకర్ జనార్దన్ నాగారం కన్నబోయిన వెంకట భిక్షం యాదవ్ తుంగతుర్తి రేగటి రవి గౌడ్ జాజిరెడ్డిగూడెం గుడిపల్లి మధుకర్ రెడ్డి మద్దిరాల పచ్చిపాల వెంకన్న యాదవ్ నూతనకల్ కట్ట మల్లారెడ్డి పలు మండలాల గ్రామ శాఖ అధ్యక్షులు సర్పంచులు మాజీ సర్పంచులు ఎన్ఎస్ఈఐ యువజన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు....