గానుగుబండ గ్రామంలో కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఎన్నిక ఏకగ్రీవం
తుంగతుర్తి :మర్చి 03తెలంగాణ వార్త ప్రతినిధి:- గానుగుబండ గ్రామంలో ఆదివారం నాడు కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలుగా మట్టపల్లి కళమ్మ ను ఏకగ్రీవంగా ఉపాధ్యక్షురాలుగా మాతంగి ముత్తమ్మ ప్రధాన కార్యదర్శి బొల్లోజు జానకమ్మ బూత్ సభ్యులుగా (238) బొబ్బలి వెంకటమ్మ, బాలగాని శకుంతల (239) గుండాల ఉమ, పోలేపాక ఎల్లమ్మ లను ఎన్నుకున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు పిలుపుమేరకు ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు రుద్ర రామచంద్రు తుంగతుర్తి మండలం మహిళా అధ్యక్షురాలు పులి సత్తమ్మ గ్రామ శాఖ అధ్యక్షుడు బోర జలంధర్ ఉపాధ్యక్షులు వెంకన్న ఆధ్వర్యంలో గ్రామ కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షురాలు మట్టపల్లి కలమ్మ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలికి గ్రామ శాఖ ఉపాధ్యక్షులు పంజల వెంకన్న సీనియర్ నాయకులకు కార్యకర్తలకు గ్రామస్తులకు నా కృతజ్ఞతలు అని తెలిపారు. ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిన కోరిక మేరకు మా గ్రామ కమిటీ సూచనలు మేరకు మా గ్రామంలో ఏ సమస్య వచ్చినా ముందుంటానని నేను ఎంతవరకు పోరాడడానికైనా సిద్ధమని చెప్పారు.