గ్రామ వెలుగు నాట్యమండలి నూతన కమిటీ ఎన్నిక......

Jun 5, 2024 - 17:35
Jun 5, 2024 - 17:54
 0  3
గ్రామ వెలుగు నాట్యమండలి నూతన కమిటీ ఎన్నిక......

మునగాల 06 జూన్ 2024 తెలంగాణవార్తప్రతినిధి:- సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామానికి చెందిన రచయిత కళాకారుడు గ్రామ వెలుగు నాట్య మండలి వ్యవస్థాపకులు కోదాటి లక్ష్మీ నరసింహారావు స్థాపించిన గ్రామ వెలుగు నాట్య మండలి నూతన అధ్యక్ష కార్యదర్శులుగా మొగిలిచర్ల సత్యనారాయణ సారిక పెద్ద రామయ్య ను  పాలకవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ... కేఎల్ నరసింహారావు స్థాపించిన గ్రామ వెలుగు నాట్య మండలాన్ని గ్రామ ప్రజలకు అంకితం చేసి కళాకారులను తీర్చి దిద్దిన ఘనత కేఎల్ నరసింహారావుదే అన్నారు. గ్రామ వెలుగు నాట్యమండలి ద్వారా నూతన కళాకారులను ప్రోత్సహించి గ్రామ వెలుగు నాట్య మండలాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామం వెలుగు నాట్య మండలి కళాకారులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State