గత రెండు రోజులుగా రాష్ట్రము లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసినాయి....

Sep 2, 2024 - 20:49
Sep 2, 2024 - 20:53
 0  5
గత రెండు రోజులుగా రాష్ట్రము లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసినాయి....
గత రెండు రోజులుగా రాష్ట్రము లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసినాయి....
గత రెండు రోజులుగా రాష్ట్రము లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసినాయి....

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో ప్రజలకు తీరని నష్టం జరిగింది....

నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం ఇప్పించేలా ప్రయత్నిస్తాను....

నడిగూడెం మండలం కాగితరామచంద్రపురం వద్ద నాగార్జున సాగర్

ప్రాజెక్ట్ ఎడమ కాలువ గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించిన

రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరల శాఖ మంత్రి

నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి,

కోదాడ శాసన సభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి

గత రెండు రోజులుగా రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసినాయన్ని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం నడిగూడెం మండలం కాగితరామచంద్ర పురం వద్ద నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువ కి గండి పడిన ప్రాంతాన్ని మంత్రి,కోదాడ స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, యస్పి సన్ ప్రీత్ సింగ్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుండి , పాలేరు నుండి బ్యాక్ వాటర్ ఎక్కువగా రావటం తో ఎడమ కాలువ కి గండి పడిందని, 300 ఎకరాల వరకు మునిగిపోయిందని, నీరు ఊరు లోకి పోకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పిందని,వారం రోజుల్లో కాలువకి గండి పూడ్చివేస్తామని మంత్రి అన్నారు 

కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో ప్రజలకు తీరని నష్టం జరిగిందని, గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆడుకుంటామని, రెండు రోజులలో వరద కి గురైన ప్రాంతాలలో సర్వే నిర్వహించి అన్ని విధాలుగా ఆడుకుంటామని మంత్రి ఈ సందర్బంగా తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఇరిగేషన్ ఎస్ ఈ రమేష్, ఆర్ డి ఓ సూర్యనారాయణ, తహసీల్దార్ సరిత, ఎంపిడిఓ విజయలక్ష్మి , ఉద్యోగులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333