గట్టుసింగారం గ్రామంలో విద్యుత్ షాక్ తో పాడి గేద మృతి

అడ్డగూడూరు 29 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని గట్టుసింగారం గ్రామంలో పాడి గేద మృతి చెందిన సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే గ్రామంలోని మద్ది ధనంజయ్య అనే రైతు పడిగేదా రోజువారి మాదిరిగానే మేత వేసుకుంటూ వెళ్ళింది. మూసి వాగులోని దాహం కోసం వెళ్లిన బర్రె నేలపై పడి ఉన్న కరెంటు వైర్లను తగిలి ప్రమాదవశాత్తు వృత్తి చెందినట్లు తెలుస్తుంది. రైతు ధనుంజయ్య తెలిపిన వివరాల ప్రకారం సుమారు బర్రె విలువ 70 వేలు ఉంటుందని అన్నారు. ఒక్కసారిగా మృతి చెందిన బర్రెను చూసిన రైతు విలవిల పోయారు. రైతు ధనుంజయకి ఎలాగైనా ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరారు.