గట్టుసింగారం అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం సూపర్వైజర్ మధురమ్మ

అడ్డగూడూరు 22 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి అడ్డగూడూరు మండల పరిధిలోని గట్టుసింగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమంలో సూపర్వైజర్ మధురమ్మ సందర్శించారు.అనంతరం మాట్లాడుతూ..చిరుధాన్యాలు పౌష్టికమైన ఆహారం తీసుకున్నట్లయితే పిల్లల ఎదుగుదల మానసిక స్థితిగతులు సరిగా ఉంటాయని తెలియజేశారు.పోషణ పక్షం రోజులు ఎంతో కీలకమన్నారు పోషణ అభియాన్ పోషణ పక్వడ పోషణ పక్షంలో స్త్రీలు చిరుధాన్యాలు మాంసకృత్తులు లభించే ధాన్యాలు ఆకుకూరలు పండ్లు గుడ్లు మాంసాహారాలను స్వీకరించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆమె తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రియాంక,అంగన్వాడి ఉపాధ్యాయురాలు స్వరూప రాణి,ఆయా సుజాత,మరియు ఏఎన్ఎం విజయ,జిఎన్ఎమ్ మౌనిక ఆశ వర్కర్స్ దుర్గమ్మ, మదనమ్మ. బాలింతలు గర్భిణీ స్త్రీలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.