గంజాయి సప్లయ్ చేస్తున్నా నిందితుడిని నిఘా ఉంచి పట్టుకున్న గద్వాల్ టౌన్ పోలీసులు

May 17, 2025 - 19:11
 0  1
గంజాయి సప్లయ్ చేస్తున్నా నిందితుడిని నిఘా ఉంచి పట్టుకున్న గద్వాల్ టౌన్ పోలీసులు

నిందితుడు అరెస్ట్, 680 గ్రాముల గంజాయి స్వాధీనం,

గత సంవత్సరం పాటు హైదరాబాద్ నుండి గంజాయి నీ తీసుక వచ్చి గద్వాల్ పట్టణ యువతకు సరఫరా చేస్తున్నా నిందితుడిని గద్వాల్ పట్టణ పోలీసులు నిఘా ఉంచి పట్టుకొని 680 గ్రాముల గంజాయి నీ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. వివరాలు: గద్వాల్ పట్టణం కుంటవీది కి చెందిన బషీర్ s/o మౌలాలి, వయస్సు - 28 సంవత్సరాలు అను వ్యక్తి గంజాయి సరఫరా చేస్తున్నాడని పోలీసులకు  సమాచారం అందగా నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు గద్వాల్ టౌన్ మార్కెట్ యార్డ్ నందు ఉదయం 10:10 గంటలకు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా  గద్వాల్ టౌన్ ఎస్సై కళ్యాణ్ కుమార్, ఐడి పార్టీ అతడిని పట్టుకొని, సంచీ నీ తనిఖీ చెయ్యగా 680 గ్రాముల గంజాయి ఉన్నట్టు గుర్తించారు, గంజాయి నీ స్వాధీనం చేసుకుని అతడిని విచారించగా గత సంవత్సరం నుండీ హైదరాబాద్ దుల్ పేట నుండి గంజాయి నీ తీసుకువచ్చి గద్వాల్ యువతకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ రోజు నిందితుడు బషీర్ ను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు  పట్టణ ఎస్సై తెలిపారు.ఎవరైన మత్తు పదార్థాలు అయిన గంజాయి, డ్రగ్స్ వంటివీ వినియోగించిన, సరపర, ఉత్పత్తి చేసిన కఠినంగా వ్యవహరిస్తాయి పట్టణ ఎస్సై హెచ్చరించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333