కోరుట్ల మున్సిపల్ లో భారీ కుంభకోణం బట్టబయలు సమావేశాన్ని బాయ్ కాట్ చేసిన  కౌన్సిలర్లు 

Oct 30, 2024 - 19:32
 0  1
కోరుట్ల మున్సిపల్ లో భారీ కుంభకోణం బట్టబయలు సమావేశాన్ని బాయ్ కాట్ చేసిన  కౌన్సిలర్లు 
కోరుట్ల మున్సిపల్ లో భారీ కుంభకోణం బట్టబయలు సమావేశాన్ని బాయ్ కాట్ చేసిన  కౌన్సిలర్లు 

హైదరాబాద్ ప్రతినిధి:-- జగిత్యాల జిల్లా కోరుట్ల అక్టోబర్ 30: రెండవ గ్రేడ్ మున్సిపల్ గా ఉన్న కోరుట్ల మున్సిపల్ కార్యాలయం లో గత పదేళ్లలో పట్టణ అభివృద్ధిని పక్కకు నెట్టేసి  స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి కోరం కూడా సహకరించలేని సమావేశాలు ఎప్పుడూ కూడా జరగలేదని కౌన్సిలర్లు ఆరోపించారు. అధికారపక్షం ప్రతిపక్షం ఒకటై తీసుకున్న నిర్ణయాలు మున్సిపల్ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా పట్టణ అభివృద్ధి కుంటు పడటంతో  సుమారు గత 15 ఏళ్లుగా  ప్రతి ఏటా వర్షాకాలంలో కోరుట్ల పట్టణానికి పై భాగంలో ఉన్న 9, 10, 11 వార్డులలో మద్దుల చెరువు గుండా వచ్చే వరద నీటితో మూడు వార్డుల్లోని రోడ్లు ధ్వంసమై మురికి కాలువలు కొట్టుకుపోయి ఇళ్లలోకి నీరు చేరి మూడు వార్డుల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటారు. విద్యుత్తు స్తంభాలు చెడిపోవడం ద్వారా ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తారని  అనేకమార్లు పాలకవర్గంతో మూడు వార్డులకు సంబంధించిన రోడ్డు బాగు చేయాలని కాలనీవాసులు రోడ్డెక్కి ధర్నా రాస్తారోకో నిర్వహించి మున్సిపల్ పాలకవర్గం, అధికారులతో మొరపెట్టుకున్న గాయత్రి బ్యాంక్ నుండి రైల్వే ట్రాక్ వరకు వెల్లే త్రోవలో మూడు వార్డులకు సంబంధించిన రోడ్డు పట్టణంలో చాలా ముఖ్యమైనదని అలాంటి రోడ్డు నిర్మాణానికి కూడా సహకరించకుండా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీద పవన్ ధ్వజమెత్తారు.15 వ ఆర్థిక సంఘం ప్లడ్ గ్రాంట్ నిధులు పట్టణంలో ముఖ్యమైన ప్రధాన కూడళ్ళలో అవసరం ఉందని జిల్లా కలెక్టర్ కు నివేదిక అందజేయకుండా వారికి అనుకూలమైన కౌన్సిలర్లు ఉండే కొన్ని ప్రదేశాలలో ఏర్పాటు చేసి వారి వార్డులలో మాత్రమే ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేసుకొని తప్పనిసరిగా అవసరం ఉన్న వార్డులలో ఏర్పాటు చేయకుండా అభివృద్ధిని అడ్డుకున్నారని ఇది సరికాదని ఆరోపించారు. మరిన్ని కూడాల్లలోని సమస్యలను జిల్లా కలెక్టర్, అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టణంలోని చీకటిగా ఉండే ప్రాంతాలు విద్యుత్ కాంతులతో అందంగా కనబడేదని పేర్కొన్నారు. మంగళవారం కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశం లో హాజరైన కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు వైస్ చైర్మన్ అత్యవసర సమావేశంలోని కొన్ని అంశాలను వారికి నచ్చినట్లు చేసుకున్నారని హాజరు రిజిస్టర్లో సంతకం చేసి స్టేజి పైకి ఎక్కకుండా కౌన్సిలర్లతో కూర్చుని నిరసన వ్యక్తపరచి చైర్పర్సన్ మెజారిటీ కౌన్సిలర్లు వారికి నచ్చిన విధంగా కొన్ని అంశాలను రూపొందించి అవసరమున్న చోట కాకుండా అనవసరమైన చోట్ల అభివృద్ధి పనులు చేసే యోచనను అడ్డుకున్నామని వైస్ చైర్మన్ గడ్డమీద పవన్ కౌన్సిలర్లు సమావేశాన్ని బాయ్ కట్ చేశామని స్పష్టం చేశారు.  అనేక వార్డులకు ఉపయోగపడే అభివృద్ధి పనులను అడ్డుకొని వారి ఇష్ట రాజ్యాంగ వారికి నచ్చిన చోట ప్రజలకు ఉపయోగం లేని చోట నిధులను దుర్వినియోగం చేస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వ, మున్సిపల్ నిబంధనల ప్రకారం వార్డు కౌన్సిల్ సభ్యులు అందరికీ ఒకే రకమైన న్యాయం ఉండేలా చూడవలసిన బాధ్యత చైర్పర్సన్, కమిషనర్ పై ఉందని వారు స్పష్టం చేశారు. ఇక ముందు ఎన్నడూ ఇలాంటి పార్టీలపరంగా వ్యక్తులను చూస్తూ వార్డు అభివృద్ధి కుంటూ పడడానికి మున్సిపల్ చైర్మన్, కమిషనర్ పాలకవర్గం కారణం కాకూడదని సూచించారు. అభివృద్ధి సంక్షేమం కోసం నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని సజ్జు, సాబీర్, మురళి, ఉమారాణి, నజియాపహీం, రేష్మరఫీ, సుల్తానాబాబా, బట్టు రాధిక, పీర్ల సత్యం తదితరులు కలెక్టర్ కు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు.

మొలుమూరి రాజ మురళి బారాసా నాయకులు 

కోరుట్ల మున్సిపల్ లో నిబంధనలకు విరుద్ధంగా నిధుల దుర్వినియోగం అవుతుందని చాలా రోజులుగా ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా చైర్పర్సన్ మెజారిటీ సభ్యులతో అవినీతికి పాల్పడుతున్నారని, అనేకమార్లు కౌన్సిలర్లు ఇదేంటని ప్రశ్నించిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పట్టణంలోని అన్ని వార్డులకు ఒకే న్యాయం ఉండాలని పేర్కొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333