బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తీసుకోవాలి

Oct 30, 2024 - 18:54
 0  33
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తీసుకోవాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తీసుకోవాలి ఆత్మకూర్ ఎస్ మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో బహిరంగంగా మద్యం తాగినా, అక్రమంగా బెల్ట్ షాపులను నిర్వహిస్తున్న తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల జేఏసీ నాయకులు బుధవారం ఎంపీడీవో హాసీం, ఏఎస్ఐ శంకర్ నాయక్ లకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం బైక్ ర్యాలీగా ఎంపీడీవో కార్యాలయానికి చేరుకొని వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగడంతో మహిళలు ఒంటరిగా చేల వద్దకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారని, కొందరు చీరల్లో తాగి సీసాలు పలగొట్టడంతో రైతులు పశువులు ప్రమాదాలు గురవుతున్నారని అన్నారు. యువకులు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి రోడ్డు ప్రమాదాలకు గురి కావడంతో కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయని అన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని అధికారులు బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కమిటీ అధ్యక్షులు భూపతి రాములు, సలహాదారు దండ వెంకట రెడ్డి, గంపల కృపాకర్, దొంతగాని కరుణాకర్, తగుళ్ల జనార్ధన్, మేడి కృష్ణ, గుండు వెంకన్న, వత్సవాయి లలిత, రవి, తదితరులు పాల్గొన్నారు.