కేంద్రం తీసుకువచ్చిన విబి-జి రామ్ జి బిల్లు: వికలాంగుల జీవనోపాధి హక్కుపై దాడి

Dec 24, 2025 - 19:21
 0  34
కేంద్రం తీసుకువచ్చిన విబి-జి రామ్ జి బిల్లు: వికలాంగుల జీవనోపాధి హక్కుపై దాడి

వెంటనే ఈ బిల్లును రద్దు చెయ్యాలి.

భువనగిరి 24 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో వికసిత్ భారత్ రోజ్‌గార్ మరియు ఆజీవికా మిషన్ (గ్రామీణ్)బిల్లు,2025 (VB-GRAMG బిల్లు) వికలాంగుల జీవనోపాధి పై తీవ్ర ప్రభావం చూపుతుందని,కేంద్రం తీసుకువచ్చిన బిల్లు రద్దు అయ్యే వరకు ఉద్యమం చేస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ హేచ్చరించారు. బుధవారం రోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ముఖ్య నాయకుల సమావేశం జిల్లా కేంద్రం లో జరిగింది.ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన  మాట్లాడుతూ.. నిరుద్యోగం, భూమిలేని, పేదరికంలో ఉన్న వికలాంగులకు, గ్రామీణ ప్రాంతంలో  ఉపాధికి కల్పించెందుకు ఉపాధి హామీ పథకం వచ్చిందని అన్నారు.నిధుల కొరత, పని నిరాకరణ, డిజిటల్ హాజరు వ్యవస్థలు మరియు పని ప్రదేశాలలో సరైన సౌకర్యాలు లేకపోవడం వలన వికలాంగులలో పని చేసే వారి సంఖ్య తగ్గితుందని అన్నారు.2023-24 ఆర్థిక సంవత్సరంలో 6,38,088 మంది వికలాంగులకు ఈ పథకం కింద ఉపాధి కల్పించబడిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని వికలాంగ కార్మికులకు జీవనోపాధిని మరింతగా కోల్పోయేలా చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వికలాంగుల ను  తీవ్రమైన పేదరికంలోకి నేడుతుందని అన్నారు.
ఈ బిల్లు 125 రోజుల పనిని అందిస్తుందనే వాదన పూర్తిగా తప్పుదారి పట్టించేదిగా ఉందని అన్నారు ఉద్దేశపూర్వక నిధుల కొరత కారణంగా సగటు ఉపాధి 50 రోజుల కంటే తక్కువగా ఉందని అన్నారు.వికలాంగులను ఉపాధికి అర్హులైన కార్మికులుగా, సామర్థ్యం ప్రకారం పని చేయడానికి మరియు జీవనోపాధి రక్షణకు చట్టబద్ధంగా గుర్తిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన VB-GRAMG బిల్లు వికలాంగుల హక్కును బలహీనపరుస్తుందని అన్నారు. గ్రామీణ వికలాంగ కార్మికుల జీవనోపాధి, గౌరవం మరియు మనుగడకు ముప్పు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం, 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం స్ఫూర్తికి భిన్నంగా ఉందని అన్నారు. ఇది వివక్ష చూపకపోవడం, సరైన సౌకర్యాలు కల్పించడం మరియు జీవనోపాధిని రక్షించడం చేస్తుందని అన్నారుఈ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.VB-GRAMG బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం గాంధీని చంపినా గాడ్సే వారసుల పేరుతో పథకాన్ని తీసుకురావడం సరైంది కాదని అన్నారు.ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షణ కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సురుపంగా ప్రకాష్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లపల్లి స్వామి జిల్లా కోశాధికారి కొత్త లలిత శ్రీహరి గోపి మురళి నాయక్ లింగ నాయక్ అనసూయ మధు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333